–ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్
Kazha Altaf Hussain : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహా త్మా గాంధీ విశ్వవిద్యాలయం మరి యు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోపరేటివ్ మేనేజ్మెంట్, సహకార మంత్రిత్వ శాఖ, ఎన్ సి డి సి ఆధ్వర్యంలో సహకార మంత్రిత్వ శాఖ గైకొన్న చర్యలు వాటి ఫలాలపై ఒకరోజు జాతీయ సెమినార్ నిర్వహించారు. అంతర్జాతీయ సహకార సంవత్స రంగా 2025ను, జులై మొదటి శని వారాన్ని సహకార దినోత్సవంగా పాటిస్తూ విశ్వవిద్యాలయ వేదికగా జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్, ఐసిఎం డైరెక్టర్ డాక్టర్ ఆర్ గణేషన్, ఎన్ సి డి సి రీజనల్ డైరెక్టర్ శార్దూ ల్ జాదవ్, జిల్లా కోపరేటివ్ ఆఫీసర్ పత్యానాయక్ హాజరై ప్రసంగించా రు.
ఈ సందర్భంగా ఉపకులపతి మా ట్లాడుతూ సహచర్యం, సమాలోచ న, సాధన, సమిష్టితత్వం, సంఘ టితత్వం సూత్రాల ఆధారంగా ఏర్ప డ్డ సహకార వ్యవస్థ దేశానికి ఎనలే ని సేవలు అందించిందని అన్నారు. సహకార వ్యవస్థ ద్వారా గ్రామాలు విజయ పదంలో దూసుకెళ్లిన అనేక ఉదంతాలు వివరించారు. విద్యార్థు లకు సైతం సహకార సంఘాల ఏ ర్పాటును విశ్వవిద్యాలయం పరిశీ లించనుందని ఎన్సిడిసి సహకారం తో వారిలో నాయకత్వ లక్షణాలు దార్శనికత, సృజనను పెంపొందిం చుటకు కార్యక్రమాలను రూపొందిం చనున్నట్లు తెలిపారు.
ఆర్జించిన జ్ఞానాన్ని సామాజిక స్పృ హను జోడించి వినూత్న ఆలోచన లతో సమాజానికి ఉపయుక్తమైన ఆవిష్కరణలు గావించాలని సూ చించారు. ఎన్ సి డి సి రీజనల్ డైరెక్టర్ శార్దూల్ యాదవ్ మాట్లా డుతూ ఎన్ సి డి సి ద్వారా వ్యవ సాయం, రిటైల్ వాల్యూ ఎడిషన్, మార్కెటింగ్, ట్రేడింగ్, స్టోరేజ్ వంటి అనేక అంశాలలో ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్ సి డి సి ద్వారా అవకాశాలను అందిపు చ్చుకునే పద్ధతులను యువత ఉ పాధికి వ్యాపారానికి ఉన్న అవకాశా లను సవివరంగా తెలియపరిచారు.
ఐ సి ఎం డైరెక్టర్ డా గణేషన్ మా ట్లాడుతూ కేంద్ర సహకార మంత్రి త్వ శాఖ తీసుకున్న 60 కార్యకార అంశాల ద్వారా సహకార వ్యవస్థ లో అనేకమైన సంస్కరణలు సా ధ్యమన్నారు. ఐ సి ఎం ద్వారా అవ గాహన కార్యక్రమాలతో పాటు డిప్ల మా కోర్సులు సైతం అందించనున్న ట్లు ఈ రంగంలో ఉన్న అవకాశాల ను యువతకు చేరవేసే ప్రతి కార్యక్ర మాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
అనంతరం సెమినార్ చైర్మన్ ఆచా ర్య ఆకుల రవి సహకార వ్యవస్థ చ రిత్రను, డా శ్రీదేవి సహకార వ్యవస్థ మహిళా సాధికారతపై, రిటైర్డ్ అధి కారి పి నరసింహారెడ్డి కోపరేటివ్ వ్యవస్థలో అవకాశాలపై ప్రసంగిం చారు. సహకార వ్యవస్థ ప్రాశ్యాన్ని తెలిపేలా రైతులు మరియు విద్యా ర్థులు అధికారులతో విశ్వవిద్యాల య ముఖ ద్వారం నుండి పాదయా త్ర నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సెమినార్ చైర్మన్ ఆచార్య ఆకుల రవి, డైరెక్టర్ ఆచా ర్య కొప్పుల అంజిరెడ్డి, ఆర్ట్స్ కళా శాల ప్రిన్సిపాల్ అరుణప్రియ, కన్వీ నర్లు డా శ్రీదేవి, డా బి ప్రసాద్, తది తర అధికారులు అధ్యాపకులు, వి ద్యార్థులు రైతులు, సహకార సం ఘాల సభ్యులు పాల్గొన్నారు.