Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

అవినీతిలో తెలుగు రాష్ట్రాలకు పోటా పోటీ

-- కేసిఆర్ అత్యంత అవినీతిపరుడు -- అభివృద్ధి మరిచి ప్రదానిని తిట్టడమే కెసిఆర్ పని --తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నాం -- తెలంగాణ లో బిజేపి అధికారం లోకి వస్తుంది -- వరంగల్ సభలో ప్రధానమంత్రి మోడీ నరేంద్ర మోడీ

అవినీతిలో తెలుగు రాష్ట్రాలకు పోటా పోటీ 

— కేసిఆర్ అత్యంత అవినీతిపరుడు
— అభివృద్ధి మరిచి ప్రదానిని తిట్టడమే కెసిఆర్ పని
–తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నాం
— తెలంగాణ లో బిజేపి అధికారం లోకి వస్తుంది
— వరంగల్ సభలో ప్రధానమంత్రి మోడీ నరేంద్ర మోడీ

ప్రజా దీవెన/వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేలుతోందని , రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో పోటీ పడుతూ నువ్వా నేనా అన్నట్లు ముoదుకు సాగుతున్నాయని ప్రధాన మంత్రి మోడీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కోన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ముందుగా భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆర్ట్స్ కాలేజీకి చేరుకున్న ఆయన రూ. 6వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణానికి, రూ.2,147 కోట్లతోజగిత్యాల-కరీంనగర్‌-వరంగల్‌ జాతీయరహదారి పనులకు, రూ.3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్‌ జాతీయరహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు అంటూ తెలుగులో మోడీ ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడి 9ఏళ్లు పూర్తయిందని, దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని వివరించారు. ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక అని. దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని చెప్పారు.

దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నామన్నారు. అనేక ఆర్థిక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నామని, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు,ఇండస్ట్రియల్‌-ఎకనామిక్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయని, కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణకు ద్రోహం చేసింది ఆ రెండు పార్టీలే నని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. .బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రధానిని తిట్టడానికే ఎక్కువ ప్రాధన్యత ను ఇస్తూ అభివృద్ధి మరిచిపోయారని విమర్శించారు.భద్రకాళి, సమ్మక్క, సారలమ్మ, రుద్రమదేవీలను ప్రధాని స్మరించుకున్నారు. సమ్మక్క- సారలమ్మ పౌరుషానికి ప్రతీకలని చెప్పారు.

రాణి రుద్రమ పరాక్రమానికి చిరునామా అయిన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వంపై మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.” కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోంది. అత్యంత అవినీతి ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.కేసీఆర్‌ సర్కారు అవినీతి దిల్లీ వరకూ పాకిందని గుర్తు చేశారు. కేంద్రం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతుంటే.. మరి రాష్ట్రం ఏం చేస్తోంది అని ప్రశ్నించారు.

అభివృద్ధి కోసం కొన్ని రాష్ట్రాలు కలిసి పని చేస్తుంటాయి. తొలిసారి అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పని చేయడం దౌర్భాగ్యంమని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి అవినీతి చూసేందుకేనా.. యువత ఆత్మబలిదానాలు చేసింది” అంటూ మండిపడ్డారు.
ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా అవినీతి తప్ప మరొకటి లేదన్నారు. కుటుంబ పాలన కొనసాగిస్తున్న బి ఆర్ ఎస్ సర్పంచ్ లను ఇబ్బందులు పెడుతుందని వారు సైతం బి ఆర్ ఎస్ సర్కార్ పై కోపంగా ఉన్నారని అన్నారు. తెలంగాణాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు ట్రైలర్ చూపించామని త్వరలో తెలంగాణాలో అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బి ఆర్ ఎస్ సర్కార్ నిరుద్యోగుల ను సైతం మోసం చేసిందని ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానాలను మొత్తం మరిచిపోయిందనని దుయ్యబట్టారు.కేంద్ర మంత్రి నితిన్ గట్కారి మాట్లాడుతూ 9సంవత్సరాల బీజేపీ పాలనలో దేశ రాష్ట్ర లను కలుపుతూ 4లైన్, 6లైన్ రహదారులు నిర్మాణం చేపట్టి నట్టు తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ మచ్చ లేని నాయకుడు , ప్రపంచ దేశాలు మెచ్చిన నాయకుడని పొగిడారు. దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం పనులు పూర్తి చేసినట్టు అన్నారు. కాజీపేట లో రైల్వే వ్యాగన్ కారణంగా 3వేల మంది కీ ఉపాధి అవకాశాలు వన్నాయి అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ మాట్లాడుతూ బీ అర్ యస్ మోడీ కార్యక్రమాన్ని బహిష్కరించడం తప్పు పట్టారు.ప్రపంచ దేశాలు మెచ్చిన నాయకుణ్ణి బహిష్కరించడం సరైంది కాదని అన్నారు.

బీజేపీ పార్టీ తనకు చాలా ఇచ్చిందని నా జీవితానికి ఇది చాలు అని అన్నారు.మోడీ బండి అని పిలవడం నా అదృష్టం గా భావిస్తున్నట్టు తెలిపారు.హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని, ,దీనిని అంత మొందించాలని ,దానికి మోడీ సహకరిస్తారని అన్నారు. దేశానికి ఇది స్వర్ణ యుగమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే పి నడ్డ , బీజేపీ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, తరుణ్ చుగ్, ప్రకాష్ కారత్, ధర్మ పూరి అరవింద్ ,బీజేపీ ఎమ్మెల్యే లు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.