Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Director B. Gopi : పత్తి రైతుల చరవాణి నంబర్లు వెంటనే అప్డేట్ చేయాలి

–రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ బి. గోపి

Director B. Gopi : ప్రజా దీవెన, నార్కట్ పల్లి: పత్తి రై తుల చరవాణి నంబర్లు అప్డేట్ చే యాలని రాష్ట్ర వ్యవసాయ, ప శు సంవర్ధక శాఖ డైరెక్టర్ బి. గోపి చె ప్పారు. గురువారం ఆయన నల్గొం డ జిల్లా నార్కెట్ పల్లి మండలం చౌ డంపల్లి వద్ద ఉన్న వరమహాలక్ష్మి జి న్నింగ్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీతో కలిసి సందర్శించారు.

నల్లగొండ జిల్లాలో ఈ వానాకాలం పత్తి ఉత్పత్తి, జిన్నింగ్ మిల్లులు, అ మ్మకాలు, తదితర విషయాలను ముందుగా వ్యవసాయ శాఖ జిల్లా అధికారులతో అడిగి తెలుసు కు న్నారు.రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల పత్తి రై తులు ఉన్నారని,నల్గొండ జిల్లాలో 2.77 లక్షల మంది పత్తి రైతులున్న ట్లు సమాచారం ఉందని డైరెక్టర్ తెలిపారు.

అయితే పత్తి అమ్మకాలకు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉన్నం దున తప్పనిసరిగా పత్తి రైతుల చర వాణి నంబర్లు అప్డేట్ చేయాల్సి ఉందని అన్నారు. జిల్లాలోని పత్తి రై తుల మొబైల్ నెంబర్లను ఎప్పటిక ప్పుడు అప్డేట్ చేయాలని చెప్పారు. అలాగే జిన్నింగ్ మిల్లులు డాష్ బో ర్డు నిర్వహించాలని, రోజు వారిగా ఎంతమంది రైతులు పత్తిని మిల్లు లకు తీసుకొస్తున్న వివరాలు, అలా గే రాబోయే వారం రోజుల్లో మిల్లు లకు వచ్చే పత్తి రైతుల వివరాల న్నిటిని నమోదు చేయాలన్నారు.

చరవాణి అప్డేట్ చేసిన రైతు ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాల న్నింటిని ఆటోమేటిక్ గా సాఫ్ట్ వేర్ లో అప్డేట్ అయ్యే విధంగా సీసీఐ సాఫ్ట్ వేర్ ను రూపొందించడం జరి గిందని, అందువల్ల పత్తి రైతుల వి వరాలన్నీ అప్డేట్ చేయాలని చె ప్పా రు. అలాగే వ్యవసాయ శాఖ తర ఫున ఒక వ్యవసాయ అధికారిని అన్ని జిన్నింగ్ మిల్లుల వద్ద నియ మించాలని, ఏదైనా కారణం చేత మిల్లుకు పత్తి వచ్చిన రోజు కొనుగో లు చేయనట్లయితే మరుసటి రోజు లేదా రెండవ రోజు రైతు అక్కడే ఉండి అమ్ముకునేం దు కు వీలుగా వ్యవసాయ అధికారులు అందు బాటులో ఉండాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన వరమహా లక్ష్మి కాటన్ మిల్లుకు పత్తి తీసుకు వచ్చిన రైతులతో ముఖాముఖి మాట్లాడారు. తేమ, నాణ్యత పరి శీలించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రైతు లు నాణ్యత ప్రమాణాలతో పత్తిని మిల్లులకు తీసుకురావాలని, నా ణ్యత ప్రమాణాల విషయమై సిసిఐ లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచిం చారు.

మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ ఆదనపు కలెక్టర్ నారాయణ అమిత్,రెవెన్యూ అద నపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.