Gutta Sukhender Reddy : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అప్పీల్, మాతృభాష, సంస్కృ తి కి విద్యార్థిదశ నుంచే బీజంపడాలి
Gutta Sukhender Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: మాతృ భాష, సంస్కృతికి విద్యార్థి దశ నుం చే బీజం పడాలని, కానీ ప్రస్తుత స మకాలీన పరిస్థితులు అందుకు భి న్నంగా మారుతున్నాయని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
గురువారం హైదరాబాద్ అబిడ్స్ బొ గ్గులకుంట లోని తెలంగాణ సా రస్వత పరిషత్ లో తెలంగాణ భా ష సాంస్కృతిక మండలి వ్యవస్థా పక అధ్యక్షులు ఆచార్య గంటా జ లంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ” తెలంగాణ భాష — సమగ్ర పరిశీలన గ్రంథాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం వై స్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డితో క లిసి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్క రించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ చిన్న నాటి నుంచే పిల్లలకు మాతృభాష దూరమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మాతృ భాష తెలుగులో మాట్లాడాలని పి ల్లలను గద్దించి చెప్పే పరిస్థితులు నే డు వచ్చాయని ఆయన అభి ప్రాయపడ్డారు.పాఠశాలల ప్రాంగ ణాల్లో, ఉపాధ్యాయులతోనే మా తృభాష పరిరక్షణ సాధ్యమవుతుం దని ఆయన అన్నారు. భాషా, సం స్కృతి లేనప్పుడు గురు శిష్యులు, తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా బంధాలు కృత్రిమంగా మారుతు న్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆం దోళన వ్యక్తం చేశారు.
మాతృభాష తెలుగులో పరిరక్షిం చా ల్సిన ఆవశ్యకత ఉందని గుత్తా సు ఖేందర్ రెడ్డి అన్నారు. మాతృభాష పరిరక్షణ ప్రభుత్వ పాఠశాలల్లోనే అమలు అవుతోందని ఆయన అ న్నారు. రాష్ట్రంలో 18 లక్షల ప్రభు త్వ పాఠశాలలు ఉండగా, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 36 లక్షలు ఉ న్నాయని, దీన్ని బట్టి మాతృభాష పరిరక్షణ పరిస్థితి ఏంటో అర్థం చే సుకోవచ్చన్నారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష తెలంగాణ ప్రాంతం
లోనే పుట్టిందని, ఆంధ్రప్రదేశ్ లో కా దని అన్నారు. శాతవాహనుల కా లం నుంచి చివరి నిజాం వరకు తెలుగు భాష ఉందని, అయితే తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ ప్రభా వం ఉండడం వల్ల యాస మారిం దని చిన్నారెడ్డి పేర్కొన్నారు. తెలం గాణ ప్రాంతం ముఖ్యంగా హైద రా బాద్ మినీ ఇండియా వంటిదని ఆ యన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషను అపహాస్యం చే శారని అన్నారు.
ప్రముఖ కవి అమ్మంగి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్న య్య తదితరులు పాల్గొన్నారు.