–అసాంఘిక కార్యకలాపాలకు పా ల్పడితే కఠిన చర్యలు
–రౌడీ షీటర్స్ ల కదలికల పైన ప్ర త్యేక నిరంతర నిఘా
–నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్
SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో రౌడీ షిటర్స్ ఎవరైన అసాం ఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠి న చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ హెచ్చరించారు. జి ల్లా పరిదిలో వివిధ కేసులలోని దా దాపు 40 మంది ముఖ్యమైన రౌడీ షిటర్లకు పిలిపించి శాంతి భద్రతల కు విఘాతం కలిగించకుండా, ఇతర నేరాలకు పాల్పడకుండా ఉండాలని కౌన్సెలింగ్ కార్యక్రమం చేపట్టారు.
జిల్లా పరిధిలో రౌడీషీటర్స్, సస్పెక్ట్ షీటర్ల కార్యకలాపాలు పోలీసుల ని ఘాలో ఉన్నాయని,చట్ట వ్యతిరేక కార్యలాపాలు ఆర్థిక, భూసెటిల్మెం ట్లు లాంటివి చేస్తూ సామాన్య ప్రజ లపై దౌర్జన్యాలు,బెదిరింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవు అని హె చ్చరించారు.తప్పు చేస్తే ఎంతటి వా రైన చట్టం నుంచి ఎవరూ తప్పిం చుకోలేరని ఇప్పటికే పలువురికి శిక్ష లు విధించడం జరిగిందని గుర్తు చే శారు. జిల్లాలో ప్రతి ఒక్కరి కదలిక లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్ర త్యేక నిఘా ఏర్పాటు చేసామ న్నా రు. ఎవరైన అసాంఘిక నేరాలకు పాల్పడితే వారిపై ప్రివెంటివ్ డిటెన్ష న్ యాక్ట్ (PD యాక్ట్) నమోదు చే యడానికి వెనుకాడబోమని హెచ్చ రించారు.
సత్ప్రవర్తనతో మెలిగే వారికి పోలీ స్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుం దని, తమ పాత పద్ధతులను వదు లుకొని సత్ప్రవర్తనతో మంచిగా మారి ఎలాంటి నేరాలు చేయకుం డా సమాజాభివృద్ధికి దోహాదపడు తూ ఉండాలన్నారు. శాంతి భద్రత ల పరిరక్షణకు ప్రజా రక్షణకు జిల్లా పోలీసు ఎల్లప్పుడు కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూటౌన్ సిఐ రాఘవ రావు,1 వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్.ఐ హరిబాబు,2 టౌన్ ఎస్.ఐ సైదులు, రూరల్ ఎస్.ఐ సై దాబాబు తదితరులున్నారు.
