Praja Deveena
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 12:05 pm Posted by : praja deveena

CPI Kunamneni Sambasiva Rao : సిపిఐ కూనమనేని సాంబశివరావు కీలక వ్యాఖ్య, ఎర్రజెండా పోరాటా లతోనే సమస్యలకు పరిష్కారo

CPI Kunamneni Sambasiva Rao : ప్రజా దీవెన, జోడేఘాట్: కమ్యూ నిస్టులు బలంగా ఉంటేనే సమాజం లో ప్రజలకు రక్షణ ఉంటుందని సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎ మ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ వందేళ్ళ ఉత్సవా ల సందర్భంగా శనివారం జోడేఘా ట్ నుండి ప్రారంభమైన సిపిఐ బ స్సు యాత్ర ఘనంగా ప్రా రంభమైం ది. ఈ జాతాను కూనంనేని సాం బ శివరావు ప్రారంభించి మాట్లాడు తూ దేశంలో రానున్న రోజులలో కమ్యూనిస్టులకే భవిష్యత్తు ఉం టుందని, ప్రజలు చట్టసభల్లో క మ్యూనిస్టులు బలంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు.

సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సిపిఐ ఉద్యమిస్తున్నదని, ముఖ్యంగా నిరుపేదలైన అలుపె రు గని పోరాటాలు నిర్వహిస్తున్నదని అన్నారు. ఎర్రజెండా పోరాటాలతో పేదలకు భూములు దక్కుతాయని, ప్రజల సమస్యలు పరిష్కారం అవు తాయని అన్నారు.సిపిఐ వందేళ్ళ ఉత్సవాల జాతీయస్థాయి ముగిం పు సభ డిసెంబర్ 26న ఖమ్మంలో లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ జరగనుందని వారు తెలిపారు.

జాతకు నాయకత్వం వహిస్తున్న సి పిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మా ట్లా డుతూ దేశంలోని మతోన్మా దాన్ని త రిమికొట్టుటకు, సమ సమాజ ని ర్మాణం కోసం కమ్యూనిస్టులు ఏకం కావాలన్నారు.

ఈ బస్సు జాతాకు సిపిఐ రాష్ట్ర సహా య కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాస రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు కలవేన శంకర్, డి హెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారపాక అనిల్ కుమార్, ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మ ణికంటరెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసిం హ, నాయకులు లక్ష్మీనారాయణ,

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రా మడుగు లక్ష్మణ్, సిపిఐ ఆసిఫా బా ద్ జిల్లా కార్యదర్శి బద్రి సాయి, స హాయ కార్యదర్శి ఆత్మకూరు చిరం జీవి, సీనియర్ నాయకులు బద్రి స త్యనారాయణ తదితరులు పాల్గొ న్నారు.