సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కు ఘన సన్మానం
CPI Party : ప్రజా దీవేన, కోదాడ: సిపిఐ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో జెకె ఫంక్షన్ హాల్ లో సోమవారం పట్టణ, మండల కౌన్సిల్ సమావేశం సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్లా వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా మునుగోడు ప్రాంతానికి చెందిన సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు నెల్లికంటి సత్యం ను ఎంపిక చేయడం హర్షణీయమని తెలిపారు. ఎమ్మెల్సీ ఉండడం వలన ఉమ్మడి జిల్లాకు న్యాయం జరుగుతుందని, ఈ పదవి సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని అన్నారు. ప్రజాసంఘాలు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. త్వరలో సెప్టెంబర్ లో సిపిఐ పార్టీ జాతీయ మహాసభలు ఆగస్టులో, రాష్ట్ర మహాసభలు జూన్ లో జిల్లా మహాసభలు, ఏప్రిల్ శాఖ మహాసభలు, మే నెలలో మండల మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ గెలిపించుకోల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉస్స్తెల సృజన, సిపిఐ సీనియర్ నాయకులు దొడ్డా నారాయణరావు , రాష్ట్ర నాయకులు కెవిఎల్ , అనంతుల మల్లేశ్వరి, యల్లవుల రాములు, ధూళిపాల ధనంజయ నాయుడు, ఉస్తెల నారాయణరెడ్డి ఎల్లంల యాదగిరి, మండవ వెంకటేశ్వర్లు, కంబాల శీను, పోకల వెంకటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, దేవరం మల్లేశ్వరి, బత్తినేని హనుమంతరావు, గుండు వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు ,బొమ్మగాని శ్రీనివాస్, చామల అశోక్ కుమార్ , నిమ్మల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.