CPM District Secretary Tummala Veera Reddy: వాక్ఫ్ బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు
–ఆలిండియా ముస్లీం పర్సనల్ లా బోర్డు నేతల పిలుపు
— దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపు
CPM District Secretary Tummala Veera Reddy: ప్రజాదీవెన నల్గొండ : భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వాక్ఫ్ బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఆలిండియా ముస్లీం పర్సనల్ లా బోర్డు చైర్మన్ ఖలీద్ సైపుల్లా రహమానీ, సభ్యులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో ముస్లీం లాబోర్డు ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నలల్లో నడుస్తూ దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. పూలగుత్తిలాంటి దేశంలో ముస్లీంలు అంటూ అందులో ఒక పువ్వును తీస్తే ఆది విచ్చిన్నం అవుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన చట్టాన్ని ఎవరూ నమ్మరని ఎద్దేవ చేశారు. ప్రపంచ దేశాలు అన్ని అభివృద్ధి వైపు చూస్తు ముందుకు పోతుంటే మోడీ మాత్రం మరోవైపు చూస్తున్నారని విమర్శించారు. భారతదేశంలో ముస్లీం ఆదివాసీలు ఎక్కడ కనబడడం లేదన్నారు. బంగ్లాదేశ్ పేరుతో సుమారు 3 వేల మంది ముస్లీం పేదలను ఆరెస్టులు చేశారన్నారు. ఆర్టికల్ 25ను అడ్డం పెట్టుకుని దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నాయని విమర్శించారు. గుజరాత్, మధ్యప్రదేశ్ ల లో వేలాది మదర్భాలు మూసీవేశారన్నారు. ఉత్తరాఖండ్ లో ఏకరీతి పౌరసత్వాన్ని అమలు చేశారా అని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ లో ఎంతోమంది నిరుపేద ముస్లీం గృహాలను బోల్డోజర్లతో కూల్చివేశారని, ముస్లీం పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారు. రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ను ఉపయోగించుకుని ముస్లీంల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి వ్యతిరేఖంగా ప్రతిఒక్కరు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం కావాలన్నారు. అందులోభాగంగా మే 25న జరిగే మానవహారంలో, జూన్ 1న డీల్లీలోని ఇందిరాగాందీ గాట్ వద్ద ధర్నాలు చేయాలని బోర్డు నిర్ణయించినందున విజయవంతం చేయాలన్నారు.
ఈసమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి ప్రసంగించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ గురుకులాల సొసైటీ ఆధ్యక్షులు ఫహీమ్ ఖురేషీ, బోర్డు సభ్యులు హజ్రత్ మౌలనా హుస్సాముద్దీన్, అఖిల్ జాఫర్ పాషా, ఉమర్ అబిదీన్, ముస్తీ మహమూద్ జుబేర్, ఫయాజ్ అహ్మద్, గయాస్ అహ్మద్, మౌలనా బషీర్ ఖాస్మీ, అజ్మతుల్లా తదితరుల ఉన్నారు.