— కట్లేరు సిల్ట్ తీసి ఎండిపోతున్న మొక్కజొన్న వరి మాగాళ్లకు నీళ్ల తో రైతులను ఆదుకోoడి
CPM Prabhakar Rao: ప్రజా దీవెన ఎర్రుపాలెం: ఎర్రుపా లెం మండలం సిపిఎం పార్టీ మండ ల కమిటీ, రైతు సంఘం ఆధ్వర్యం లో మామునూరు గ్రామ వరి, మొ క్కజొన్న పొలాలను పరిశీలించా రు. ఈ సందర్భంగా సిపియం పార్టి, రైతు సంఘం జిల్లా నాయకులు దివ్వెల వీరయ్య,సిపిఎం పార్టీ మం డల కార్యదర్శి మద్దాల ప్రభాకర రావు మాట్లాడుతూ కట్లేరు ఆయ కట్టు కింద వేలది ఎకరల మొక్క జొన్న,వరి పొలాలు సాగు జరుగు తుందని కట్లేరులో నీరు లేక పొలా లు నెర్రేలు భారి పంటలు ఎండిపో యే పరిస్థితులు నెలకొన్నాయని సాగు చేస్తున్న రైతులు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని వెంటనే లంకా సాగర్ ద్వారా కట్లెరుకు నీరు వదిలి పంటలను ఆదుకోవాలన్నా రు.
లంక సాగర్ ద్వారా కట్లేరుకు నీళ్లు వదలాలని కట్లేరు సిల్టు తీసి స్థిరీకరణ పెంచి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాం డ్ చేశారు.పాలకులు పట్టించుకోక పోతే రైతంగానికి వలసలే దిక్కం టూ వాపోతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు రైతాంగా సమస్యలను పట్టించుకోకుండా హడావుడి చేస్తే ప్రయోజనం ఏముందాని ప్రధానంగా మధిర నియోజక వర్గoకు సాగునీరు తాగు నీరు సమస్య లేకుండా పరి ష్కరిం చాలని లేనిపక్షంలో రైతాంగాన్ని, ప్రజన్లను సమీకరించి ప్రత్యేక్ష ఆందోళన,పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు, కన్నె బోయిన శ్రీనివాసరావు, గొల్లపూడి నారాయణ అమల మోక్షానందం, కొమ్మినేని రామారావు శీలం రం గారావు, వెంకటేశ్వరరావు, బాప య్య గోపి,నాగేశ్వరరావు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.