CPM Prabhavati : ప్రజా దీవెన, కనగల్: ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అ మలు చేయాలని అర్హులైన పేద లందరికీ రేషన్ కార్డులు, ఇండ్ల స్థ లాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కా ర్యదర్శి వర్గ సభ్యురాలు పాల డు గు ప్రభావతి అన్నారు. మంగళవా రం సిపిఎం పోరుబాట కార్యక్రమం లో భాగంగా కనగల్లు మండలం జి ఎడ వెల్లి గ్రామంలో ప్రజా సమస్య లపై సర్వేలు నిర్వహించడం జరి గింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లా డుతూ ప్రభుత్వం మహి ళలకు ఇస్తామన్నా 2500 ఇంతవ రకు ఇవ్వలేదని అన్నారు. పేదలకు ఇండ్లు లేక అనేక ఇబ్బందులు ప డుతున్నారని ఇండ్ల స్థలం ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని తెలి పారు. ఇందిరమ్మ అభయ హస్తం కొద్దిమందికి మాత్రమే లబ్ధి చేకూ రిందని ఉపాధి కార్డు ఉన్న భూమి లేని నిరుపేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
20 రోజులు పనికి పోలేదు అనే సాకుతో నిరు పేదలను వదిలేస్తున్నారని అ న్నారు. నేటికీ నూతన పెన్షన్లు అర్హత ఉన్నప్పటికీ ఇవ్వడం లేదని, ప్రజలు తెలియజేశారని చెప్పారు. ప్రజా సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్నామని సమస్యల ఆధారంగా ఆందోళన పోరాటాలు ఉంటాయని తెలియజేశారు. ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహిస్తున్నట్టు వేలాది మంది ప్రజలు పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యురాలు ఎండి సుల్తాన మమత అలివేలు గంటప్ దుర్గమ్మ కొరివి శంకరమ్మ మానుపాటి బుచ్చమ్మ కలమ్మ సుజాత భోగరాజు నాగమ్మ పి సునీత నిర్మల తదితరులు పాల్గొన్నారు.