Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Criminal laws: నేటి నుంచే నేరచట్టాలు

–దేశం లో ఇకపై ఇంటి చట్టాలతో స్వదేశీ విధానం అమలు
–ఐపీసీ ఇక బీఎన్‌ఎస్‌, సీఆర్‌పీసీ– బీఎన్‌ఎస్‌ఎస్‌, ఎవిడెన్స్‌ యాక్ట్‌– బీఎస్‌ఏగా మార్పులు
–భారతీయ న్యాయ సంహిత, నాగరిక్‌ సురక్ష, సాక్ష్య అధినియమ్‌
–కొత్త చట్టాలపై ఆయా వర్గాల్లో తీవ్ర అభ్యంతరాలు
–పరాయి చట్టాలను పక్కన పెట్టి ఇవి మన కోసం రూపొందించుకున్న చట్టాలన్న అమిత్‌ షా

Criminal laws: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో సుధీర్ఘకాల చట్టాలకు చరమగీతం పాడుతూ కొత్త నేర చట్టాలు (criminal laws)అమల్లోకి వచ్చాయి. దేశ నేర న్యాయవ్య వస్థలో విస్తృతమైన మార్పులు, చేర్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టా లు జూలై 1వ (July1st)తేదీ సోమవారం నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు పూర్తిస్థాయి కార్యాచరణ పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం (Central government). బ్రిటిష్‌ కాలం నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) ఇక మీదట భారతీయ న్యాయ సంహితగా (బీఎన్‌ఎస్‌), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌ పీసీ) భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)గా, ఇండి యన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ భారతీయ సాక్ష్య అధినియమ్‌ (బీఎస్‌ఏ)గా మారనున్నాయి. కాగా వివిధ వర్గా ల నుంచి నూతన చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటి అమలును నిలిపి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్‌ కూడా దాఖ లైంది. గత ఏడాది డిసెంబరులో సదరుచట్టాల తాలూకు బిల్లుల ఆమోదం సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభల (lok shaba,raj shaba)నుంచి ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేశారని, చర్చ జరపకుండానే బిల్లు లను ఆమోదించారని పిటిషనర్లు అంజలీ పటేల్‌, ఛాయామిశ్రా పేర్కొ న్నారు. ప్రజల నుంచి కూడా ఈ కొత్త చట్టాలపై అభిప్రాయాలను సేక రించలేదన్నారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నా రని గుర్తు చేశారు. ఈ చట్టాల ప్రకా రం నిందితులకు బెయిల్‌ ఇచ్చే అవ కాశాలు గణనీయంగా తగ్గిపోతాయ ని, పోలీసులకు (police)విపరీతమైన అధి కారాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరోవైపు, కొత్త నేరచట్టాల అమలు ను వాయిదా వేయాలని కోరుతూ పౌరహక్కుల ప్రజాసంఘం (పీయూ సీఎల్‌) కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌కు లేఖ రాసింది. క్రిమినల్‌ లాయర్లు, దర్యా ప్తు సంస్థలు, న్యాయమూర్తులు, సాధారణ పౌరుల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయాలు సేకరించ కుండానే ఈ చట్టాలను తీసుకొచ్చా రని గుర్తు చేసింది. భారతదేశ ప్రజా స్వామ్యంపై దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావం చూపే ఈ చట్టాలపై ఇప్ప టికైనా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చలు జరపాలని, అప్పటి వరకూ వాటి అమలును వాయిదా వేయా లని పీయూసీఎల్‌ కోరింది. వలస చట్టాల నుంచి బయటపడుతు న్నా మని చెబుతూనే నాటి బ్రిటీష్‌ చట్టా ల్లోని అనేక అంశాలను యథాతథం గా తీసుకొచ్చారని(కట్‌ అండ్‌ పేస్ట్‌) పీయూసీఎల్‌ వెల్లడించింది. మరోవై పు నూతన నేర చట్టాలు పేరులోనే గాక సారంలోనూ భారతీయతను కలిగి ఉన్నాయని, వాటి ఆత్మ, శరీ రం, స్ఫూర్తి భారతీయత అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Sha)పేర్కొన్నారు. ‘భారతీయుల కొరకు భారతీయుల చేత భారత పార్లమెంటు ద్వారా ఇవి రూపొందాయి. వలసకాలపు చట్టాలకు దీంతో తెరపడిందన్నా రు.

*కొత్త చట్టాల్లోని కొన్ని వివాదా స్పదo*..న్యాయసంహిత చట్టంలో గ్యాంగ్‌, వ్యవస్థీకృత నేరముఠాల వంటి పదాలున్నాయిగానీ వాటిని నిర్వచించలేదు. ఫలితంగా అమా యకులను కూడా కేసులతో ఇరికిం చే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. న్యాయ సంహిత ప్రకారం మానసిక వికలాం గులకు విచారణ నుంచి రక్షణ లభి స్తుంది. అయితే, బుద్ధిమాంద్యం ఉ న్న వారిని ఈ క్యాటగిరీలో చేర్చ లే దు. దీంతో బుద్ధిమాంద్యం ఉన్న వారిపై కేసు నమోదు చేయొచ్చు. నాగరిక్‌ సురక్ష సంహిత ప్రకారం పోలీసులు నిందితులను తమ కస్టడీలో (custody)15 రోజులపాటు ఉంచు కోవచ్చు. అంతేకాకుండా ఆ తర్వా త కూడా 40 నుంచి 60 రోజుల అదనపు కస్టడీని కోరవచ్చు. ఈ కస్ట డీని ఒకేదఫాలోగానీ పలుదఫాల్లో గానీ అమలుపరచవచ్చు. తద్వారా నిందితుడికి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసినా కూడాపోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎలక్ట్రానిక్‌ రికార్డులను ఎవిడెన్సు యాక్ట్‌ ద్వితీయస్థాయి సాక్ష్యాధారాలుగా పరిగణిస్తే దాని స్థానంలో వచ్చిన భారతీయ సాక్ష్య అభినియమ్‌ వాటిని ప్రథమ స్థాయి సాక్ష్యాధారాలుగా పరిగణిస్తోంది. తద్వారా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి సాధనాలతోపాటు సెమీకండ క్టర్‌ మెమొరీలో నిక్షిప్తమై ఉన్న స మాచారాన్ని కూడా సాక్ష్యాధారం గా భావిస్తుంది. వీటిని సాక్ష్యంగా పరిగ ణించే కొత్త చట్టం పోలీసులు వీటిని నిందితుల నుంచి స్వాధీనం చేసుకు న్నప్పుడు లేదా తనిఖీ (check)నిర్వహిం చినప్పుడు వాటిల్లో లేని సమాచా రాన్ని తామే స్వయంగా చొప్పిస్తే పరిస్థితి ఏమిటి అన్నదానిని మా త్రం చర్చించలేదు. అటువంటి పరి స్థితి తలెత్తకుండా ఎటువంటి చర్య లనుగానీ, నిబంధనలనుగానీ పేర్కొ నలేదు.

*ఇతరేతర ప్రధానాంశాలు…*
క్రిమినల్‌ కేసుల్లో (criminal case)విచారణ ప్రారంభ మైన తర్వాత 60 రోజుల్లోపు అభి యోగాలు నమోదు చేయాలి. విచా రణ పూర్తయిన 45 రోజుల్లోపు న్యాయమూర్తి తీర్పు వెలువరించా లి. గరిష్ఠంగా కేసును రెండుసార్లు మాత్రమే వాయిదా వేయాలి. రేప్‌ బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు (police)అధికారి బాధితురాలి సం రక్షకుల సమక్షంలో నమోదు చేయా లి. ఘటన జరిగిన తర్వాత ఏడు రోజుల్లోపు వైద్య నివేదిక సిద్ధం కావాలి. సాక్షులకు రాష్ట్ర ప్రభుత్వా లు రక్షణ కల్పించాలి. లింగసమాన త్వంలో భాగంగా లింగం (జెండర్‌) అనే క్యాటగిరీ కింద ట్రాన్స్‌జెండర్లకు కూడా అవకాశం. అదే సందర్భంలో
కొత్త నేరచట్టాల అమలుకు ముందు (2024 జూలై 1వ తేదీకి ముందు) జరిగిన నేరాలను ఐపీసీ తదితర పాత చట్టాల ప్రకారం విచారించా ల్సి ఉంటుంది. జూలై 1 నుంచి జరి గిన నేరాలను కొత్త చట్టాల ప్రకారం విచారించాలి. ఇది తీవ్ర గందరగో ళానికి దారితీసి న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కేసుల నమోదులో పోలీసులకూ ఇటువం టి ఇబ్బందులు ఎదురవుతాయి.
కాగా నిందితులు వీడియో కాన్ఫ రెన్స్‌ ద్వారా విచారణ జరపవచ్చని కొత్త చట్టాలు చెబుతున్నాయి. కానీ దేశంలోని 80% కోర్టుల్లో దీనికి అవ సరమైన మౌలిక సదుపాయాలు లేవు.

*భారతీయ సాక్ష్య అధినియమ్‌*

–ఇంతకుముందటి ఎవిడెన్స్‌ యాక్ట్‌ లోని పలు అంశాలను దీంట్లో తిరిగి కొన్ని మార్పులతో పొందుపరిచారు. ఉదాహరణకు, ఎవిడెన్స్‌ యాక్టులో భారత భూభాగం అంతటికీ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేయగా.. దాం ట్లో ఉన్న ‘ఇండియా’ అనే పేరును బీఎస్‌ఏలో తొలగించారు. తద్వారా భారత భూభాగం వెలుపలి ప్రాంతా లకు చెందిన డిజిటల్‌ రికార్డులను కూడా సాక్ష్యంగా పరిగణించటానికి అవకాశం ఏర్పడింది.

–స్మార్ట్‌ఫోన్లు, ఇతర డిజిటల్‌ ఉపక రణాల్లోని వివరాలను కూడా సా క్ష్యాధారాలుగా పరిగణిస్తూ ‘డాక్యు మెంట్‌’ నిర్వచనాన్ని విస్తృతపరి చారు. ఆడియో, వీడియో రికార్డు లను కూడా ఎవిడెన్స్‌గా పరిగణిస్తా రు.

–ఆర్థిక తదితర రంగాల నిపుణుల మౌఖిక అభిప్రాయాలనూ సాక్ష్యాధా రంగా పరిగణిస్తారు.ఏదైనా కేసులో నిందితులు ఒకరి కంటే ఎక్కువ ఉంటే.. విచారణ దశలో వారిలో ఎవరైనా పరారైనా ఆ నిందితుడి గైర్హాజరులోనే విచారణ కొనసాగు తుంది.

*భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)*
–ఇప్పటి వరకున్న సీఆర్‌పీసీ ప్రకా రం పోలీసులు తొలుత ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన తర్వాతే విచారణ ప్రారంభించాలి. వివాహ సంబంధిత వివాదాలు, వ్యాపార గొడవలు వం టి కొన్నింట్లోనే తొలుత విచారణ జరి పి ఆ తర్వాత అవసరమైతే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేస్తారు. కానీ, కొత్త చట్టం ప్రకారం పోలీసులు ఏ కేసులోనైనా తొలుత ప్రాథమిక విచారణ జరిపి, అవసరమైతేనే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలి.
— పోలీస్‌ స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఘటన ఎక్కడ జరిగినా ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయవచ్చు. దీనినే జీరో ఎఫ్‌ఐఆర్‌గా వ్యవహరిస్తున్నారు.

— పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఏదైనా ఘటనపై ఫోన్‌ తదితర సమాచార సాధనాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

–అరెస్టు చేసిన వ్యక్తుల వివరాలను పోలీస్‌ స్టేషన్‌లో అందరికీ కనిపిం చేలా ప్రదర్శించాలి. తద్వారా సద రు వ్యక్తుల బంధుమిత్రులు తగు న్యాయపరమైన చర్యలు చేపట్టటానికి వీలవుతుంది.

–ప్రస్తుతం ఈడీకి నిందితుల ఆస్తులను జప్తు చేసే అధికారం ఉన్నట్లుగా నేరాలపై దర్యాప్తు జరిపే సంస్థలకు కూడా ఆస్తుల జప్తు అధికారాల్ని ఈ కొత్త చట్టం కట్టబెడుతోంది.

–వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితులు, బాధితులు, సాక్షులు విచారణకు హాజరు కావచ్చు. ఇదే పద్ధతిలో వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయవచ్చు.

–స్వాతంత్రోద్యమంలో నాటి జాతీయ నాయకులను జైళ్లలో పెట్టటానికి బ్రిటీష్‌ ప్రభుత్వం ఉపయోగించిన దేశద్రోహ చట్టం అమలును సుప్రీంకోర్టు 2022లో నిలిపివేసింది. ఈ చట్టంపై సమీక్ష జరుపుతామని కేంద్రం నాడు సుప్రీంకోర్టులో తెలిపింది. కానీ, కొత్త చట్టంలో తిరిగి దేశద్రోహ చట్టాన్ని రాజద్రోహం పేరుతో తీసుకొచ్చింది.

*భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)*
–మహిళలు, పిల్లలపై జరిగే నేరాల పై విచారణకు ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి చేసుకుంటాననో లేదా మరో విధంగానో యువతులను మోసగిం చి లైంగికంగా సంబంధం పెట్టుకోవ టాన్ని సెక్షన్‌ 69 ప్రకారం నేరంగా పరిగణిస్తారు. మైనర్‌పై గ్యాంగ్‌రేప్‌ నకు పాల్పడిన వారికి మరణశిక్ష లేదా జీవితఖైదు విధిస్తారు.
–బాధిత మహిళలను, పిల్లలను ఆస్పత్రిలో చేర్చగానే వారికి తొలుత ఉచితంగా వైద్యం అందించాల్సి ఉంటుంది.
–ఉగ్రవాదం, ఉగ్రవాద చర్యలను తొలిసారిగా నిర్వచించి నేరచట్టం కిందికి తీసుకొచ్చారు.

–ఇంతకుముందటి దేశద్రోహం నేరాన్ని రాజద్రోహంగా మార్పు చేశారు.

–నిర్లక్ష్యంతో వాహనం నడిపించి మరణానికి కారణమైన నేరస్థులకు (హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో) ఇప్పుడున్న రెండేళ్ల జైలు శిక్షను ఐదేళ్లకు పెంచారు.
–మూకదాడిని హత్యతో సమా నంగా పరిగణించి విచారిస్తారు.
–శిక్ష అమలులో భాగంగా నిందితు లతో సామాజిక సేవ చేయించటం అనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టా రు.అరెస్టు సందర్భంగా నిందితుల చేతులకు బేడీలు వేయటాన్ని పున రుద్ధరించటం, తప్పనిసరిగా ఎఫ్‌ఐ ఆర్‌ నమోదు చేయాలన్న ప్రస్తుత నిబంధనను తొలగించటం.. పాతకాలపు పోకడలకు దేశాన్ని మళ్లీ తీసుకెళ్లటంగా పలువురు భావిస్తున్నారు.