Customs officials: ప్రజా దీవెన, ముంబై: టూత్‌పేస్ట్ కవర్‌లో మొసళ్ల పిల్లలను (Baby crocodiles) అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు కుర్లా స్థానికులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్ (Mumbai Airport) మీదుగా తరలిస్తున్న మహ్మద్ రెహాన్ మద్నీ (41), హమ్జా మన్సూరి (30)లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కైమన్ జాతికి చెందిన ఐదు మొసళ్ల పిల్లలను అక్రమంగా తరలించేందుకు వారు ప్రయత్నించారు. టూత్‌పేస్ట్ కవర్‌లో స్వల్ప కదలిక కనిపించడంతో కస్టమ్స్ తనిఖీల్లో మొసళ్ల పిల్లలు కనిపించింది. టూత్ పేస్టులో (Tooth paste) ఐదు నుంచి ఏడు అంగుళాల పిల్ల మొసళ్లు ఉన్నాయి. ప్రత్యక్ష మొసళ్లను దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్ (License)అవసరం. కానీ వారిద్దరికీ లైసెన్స్ లేదు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.