Cyber Crime : ప్రజా దీవేన, కోదాడ: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో షీ టీమ్ ఎస్ఐ నీలిమ సూచనలతో కోదాడ పట్టణంలోని PPR మాల్ లో షీ టీమ్స్, సైబర్ నేరాలపైన మాల్ లో పని చేసే మహిళా సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా షి టీమ్ మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత మాట్లాడుతూ మహిళలపై వేధింపులు జరిగితే షీ టీం వాట్సాప్ నెంబర్8712686056 కుసమాచారం ఇవ్వాలని తెలిపినారు.సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు.టీ సేఫ్” యాప్ పై మహిళలు అవగాహన కలిగియుండాలని తెలిపారు.
వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు ఈ కార్యక్రమం నందు షీ టీం మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి ,మరియు మాల్ సిబ్బంది పాల్గోన్నారు.