Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cyberabad CP Sudhir Babu: బ్యాంకులు తమ భద్రతను మెరుగుపరుచుకోవాలి — సైబరాబాద్ సీపీ సుధీర్ బాబు

Cyberabad CP Sudhir Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: సీసీటీవీ కెమెరాల ద్వారా ఇతర ఆధునిక టెక్నాలజీలతో బ్యాంకు దోపిడీలు, దొంగతనాల వంటి నేరాలను నివారించవచ్చని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. రాయపర్తి, బీదర్తో పాటు మంగళూరులో ఇటీవల జరిగిన బ్యాంక్ దోపిడీ సంఘటనల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ముందస్తు నేరనివారణ చర్యలలో భాగంగా బ్యాంకులకు తగిన విధంగా భద్రత కల్పించడా నికి మరియు బ్యాంకుల పట్ల ప్రజ లకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడా నికి బ్యాంకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,భద్రతాపరమైన ఏర్పాట్లపై నేరేడ్ మెట్ లోని రాచ కొండ కమిషనరేట్ కార్యాలయంలో సిపి సుధీర్ బాబు రాచకొండ పరి ధిలోని అన్ని రకాల బ్యాంకుల ప్ర ధాన అధికారులు మరియు ఇతర సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కమిషనర్ సుధీర్ బాబు మాట్లా డుతూ బ్యాంకింగ్ రంగం అనేది సొసైటీ మనుగడకు పలు రకాల వ్యాపార వాణిజ్య కార్యకలాపాల గమనానికి మూలస్తంభం వంటిదని పేర్కొన్నారు.

 

ప్రజలు తమ కష్టా ర్జితాన్ని ఎంతో నమ్మకంతో బ్యాం కులో దాచుకుంటారని, వ్యాపార వాణిజ్య కార్యకలాపాల ద్వారా తమ ఎదుగుదల కోసం బ్యాంకుల పైనే ఆధారపడతారని తెలిపారు. అటువంటి బ్యాంకులకు తమ వం తు బాధ్యతగా తగిన రక్షణ కల్పిం చడానికి పోలీసుశాఖ చేస్తున్న దై నందిన పెట్రోలింగ్ గస్తీ విధులలో భాగంగా బ్యాంకుల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం జరుగుతోం దన్నారు. రాయపర్తి, బీదర్, మంగ ళూరులో ఇటీవల జరిగిన బ్యాంక్ దోపిడీ సంఘటనలు బ్యాంకుల భద్రత యొక్క బలహీనతలను బయటపెట్టాయని, పోలీసు శాఖ ఎన్ని భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నప్పటికీ, తమవంతుగా గస్తీ విధులు నిర్వహిస్తున్నప్పటికీ బ్యాంకులు పాటిస్తున్న పాతకాలపు లోపభూయిష్టమైన భద్రతాపరమై న ఏర్పాట్లు మరియు అజాగ్రత్త చర్యల మూలంగా కొన్ని బ్యాంకు దోపిడీల వంటి నేరాలు పునరావృ తం అవుతున్నాయని కమిషనర్ తెలిపారు. ఇటీవలి ఘటనల నేప థ్యంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని 489 బ్యాంకులను తమ అధికారులు సందర్శించి భద్రతా చర్యలను సమీక్షించినట్టు పేర్కొ న్నారు. నాణ్యత లేని బ్యాంకు భవనాలు, బలహీనమైన భద్రతా ఏర్పాట్లు మరియు లాకింగ్ వ్య వస్థ, సెక్యూరిటీ గార్డులు అప్రమ త్తంగా లేకపోవడం లేదా అసలు నియమించుకోకపోవడం, పాత కాలం నాటి అలారం వ్యవస్థ, సీసీ టీవీలు లేకపోవడం, డేటా ఫుటేజ్ సింగిల్ బ్యాకప్ మాత్రమే ఉండడం వంటి లోపాలు కలిగిన బ్యాంకు లను గుర్తించి, తీసుకోవలసిన చర్యలను కమిషనర్ బ్యాంకుల ప్రతినిధుల దృష్టికి తెచ్చారు.

 

ఈ సందర్భంగా కమిషనర్ బ్యాం కుల ప్రతినిధులకు భద్రతా పరమై న మౌలిక సదుపాయాల గురించి పలు విలువైన సూచనలు చేశారు. బ్యాంకు ప్రాంగణంలో అవసరమైన అన్నిచోట్ల సీసీటీవీ కెమెరాలను అమర్చుకోవాలని, దొంగతనాల వంటి నేరాల నివారణకు సీసీటీవీ కెమెరాలు ఎంతగానో ఉపయోగప డటమే కాక బ్యాంకు దోపిడీల వం టి తీవ్రమైన నేరాల పరిశోధనలో సీసీటీవీ ఫుటేజ్ అతి ముఖ్యమైన సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొ న్నారు. బ్యాంకు ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు, క్యాష్ కౌంటర్లు మరియు స్ట్రాంగ్ రూమ్‌లతో సహా అన్ని ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేసేలా 24/7 పనిచేసే సీసీ టీవీ కెమెరాలు అమర్చాలని, ఫుటే జ్ క్లౌడ్ నిల్వ (ప్రత్యామ్నాయ నిల్వ) ఉండేలా చూసుకోవాలని మరియు బ్యాటరీతో పనిచేసే స్టోరేజ్‌ కలిగిన రహస్య కెమెరాలను అమర్చాలని సూచించారు.

 

తెలం గాణ ప్రజా భద్రతా చట్టంలో నిర్దే శించిన నిబంధనలను తప్పని సరిగా పాటించాలని, ట్రెజరీ యొ క్క సాంకేతిక భద్రత RBI సూచిం చిన కనీస ప్రమాణాల కంటే తక్కు వగా ఉండకూడదని పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు నిరోధించడానికి కిటికీలకు గ్రిల్స్ ఉండాలని, వాహన దాడులను నిరోధించడానికి కంచె లు, గేట్లు, బొల్లార్డ్‌లు వాహన బారికేడ్‌ల వంటివి ఏర్పాటు చేసు కోవాలని సూచించారు. అనధికారి క యాక్సెస్ నిరోధించడానికి ఎప్ప టికప్పుడు అందుబాటులోకి వస్తు న్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, నూతన భద్రతాపరమైన పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ సూచించారు.

 

తమ బ్యాంకులను సైబర్ నేరగాళ్ళ నుంచి రక్షించుకోవ డానికి తమ సాఫ్ట్వేర్లను ఎప్పటి కప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉం డాలని అంతేకాకుండా సూచించా రు. ఏటీఎంలలో డబ్బు నింపే వాహనాలకు రక్షణగా నిర్దేశిత నియమాలకు అనుగుణంగా శిక్షి తులైన సిబ్బందిని కాపలాగా పం పాలని ప్రత్యేకంగా సూచించారు.బ్యాంకుల భద్రత కోసం పోలీసు వారి సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అవాంచిత సంఘ టనలు తమ దృష్టికి రాగానే తక్ష ణమే పోలీసు వారికి సమాచారం అందించాలని బ్యాంకుల ప్రతిని ధులకు సూచించారు.ఈ కార్య క్రమంలో డిసిపి యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్, డిసిపి ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డిసిపి మల్కాజ్గిరి పద్మజ ఐపిఎస్, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి మహేశ్వరం సునీత రెడ్డి, డీసీపీ ఎస్ఓటి 1 రమణా రెడ్డి, డిసిపి ఎస్ఓటి 2 మురళీధర్, ఏసీపీ ఐటీ సెల్ నరేందర్ గౌడ్, ఏసీపీ సీసీఆర్బి రమేష్ మరియు ఇతర అధికారు లు పాల్గొన్నారు.