Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DCC President Ketawat Shankar Naik : కాంగ్రెస్ అణగారిన వర్గాల పార్టీ

— ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్

DCC President Ketawat Shankar Naik : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తూ ముందు కు పోతుందని ఎమ్మెల్సీ, డిసిసి అధ్య క్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం నల్గొం డలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగి న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర సన్నాక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, సంవిధాన్ కా ర్యక్రమం తీసుకొచ్చారని తెలిపా రు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్ట ర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడు అణ గారిన వర్గాలకు రిజర్వేషన్, రాజకీ య ప్రాముఖ్యత కల్పించాడని అన్నారు.

అంబేద్కర్ భారత రాజ్యాంగం తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధులను, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమాని స్తుందని ఆరోపించారు.బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జైశ్రీరామ్ నినాదంతో మతతత్వం పేరుతో బాగా వేయాలని చూస్తుందని విమర్శించారు.

మోడీ, అమిత్ షా భారత రాజ్యాం గాన్ని అవమానపరిచే విధంగా మా ట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రతి ఒక్కరు తీవ్రం గా ఖండించాలన్నారు. ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీనేని పేర్కొన్నారు.
మతతత్వంతో పాలన సాగిస్తే ప్రజల భవిష్యత్తుకు ప్రమాదం ఏర్ప డుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అణగారిన వర్గాలు, అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు.

ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా గ్రామాలలో పాద యాత్ర నిర్వహించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొ న్నారు.. పార్టీలో కష్టపడి పనిచే సిన వారికి తప్పనిసరిగా ప్రా ధాన్య త కల్పించడం జరుగుతుందని తెలిపారు.

సీడ్ కార్పొరేషన్ చైర్మన్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అ న్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిందని పేర్కొన్నారు. మతత త్వంతో పాలన సాగిస్తున్న పార్టీ లకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీ పటిష్టత కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ చైర్మన్ మల్లాది పవన్, కో-ఆర్డి నేటర్ శత్రు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని ,కాంగ్రెస్ పార్టీ వలనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిం దని స్పష్టం చేశారు.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో అణ గారిన వర్గాల సంక్షేమం కోసం భార త రాజ్యాంగాన్ని రూపొందించాడని అన్నారు.

కేంద్రంలోని నాయకులు రాజ్యాం గాన్ని అవమాన పరుస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
జై బాపు, జై భీమ్, జై సన్నిధానం నినాదాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు, శ్రేణులకు సూచిం చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సంజీవ్ ముది రాజ్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరీ రమేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, మాజీ ఎంపీపీ పోలగోని సత్యంతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పలువు రు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయ కులు పాల్గొన్నారు.