–పార్టీలో కష్టపడిన ప్రతి వ్యక్తికి గు ర్తింపు ఉంటుంది
— ఏఐసీసీ ఎన్నిక పరిశీలకుడు శరత్ రౌత్, ఎమ్మెల్యే మందుల సామెల్
DCC Presidents : ప్రజా దీవెన, తుంగతుర్తి: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసీ సీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ దేశాల మేరకు దేశంలోనే తొలి సా రిగా తెలంగాణలో డిసిసి అధ్యక్షుల ఎంపిక లో నూతన విధానం చేపట్టా మని ఏఐసీసీ ఎన్నికల పరిశీలకు డు శరత్ రౌతు, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మం గళవారం తుంగతుర్తి నియోజకవ ర్గం కేంద్రం లోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన నిర్వ హించిన సమావేశంలో సత్తుపల్లి ఎ మ్మెల్యే రాగమయితో కలిసి సమా వేశం నిర్వహించారు.
ఈ మేరకు ఉదయం నుంచి సా యంత్రం వరకు డిసిసి అధ్యక్షుడు నియామకం కోసం పార్టీలోని సీని యర్ నాయకులు, ఆశవాహులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒక్కొక్కరి గా వారి అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా తీసుకున్నారు ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ సూ ర్యాపేట జిల్లా కమిటీ అధ్యక్షుని ఎం పిక పారదర్శకంగా, ప్రజాస్వామ్య యుతంగా నిర్వహించడం జరుగు తుందన్నారు.
ప్రజాస్వామ్య యుతంగా,పార్టీ నా యకులు, కార్యకర్త మనోభావా ల ను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని డిసిసి అధ్యక్షుని నియా మకం చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.అందులో భాగంగానే తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సమావేశం నిర్వహించామని తెలి పారు.
డిసిసి అధ్యక్షుడు నియామకం త ర్వాత బ్లాక్,మండల, గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎంపిక ని ర్వహిస్తామని తెలిపారు. క్షేత్రస్థా యిలో పర్యటించి డిసిసి అధ్యక్షు డు నియామకానికి సంబంధించి అందరి అభిప్రాయాలను తీసుకుం టామని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ లో కష్టపడిన వ్యక్తికి, అందరినీ స మన్వయపరిచే వ్యక్తికి, అందరి అభిప్రాయాలను తీసుకొని డిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.
పార్టీలో కష్టపడి పని చేసిన వ్యక్తికి తప్పకుండా న్యాయం జరుగుతుం దని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ
దిశా నిర్దేశంతో పారదర్శకంగా డిసి సి అధ్యక్షుని ఎంపిక చేయడం జరు గుతుందని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఆలోచన కు అనుగుణంగా పార్టీకి అంకితభావంతో పనిచేసే వా రిని,అందరినీ సమన్వయంతో పా ర్టీని ముందుకు నడిపించే వ్యక్తిని ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.
రాజకీయ సమీకరణలను, అభి ప్రాయాలను పరిగణలోకి తీసుకొని దరఖాస్తులను ఏఐసిసికి అందజే యడం జరుగుతుందని పేర్కొ న్నా రు. దేశ చరిత్రలో మొట్టమొదటిసా రిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య యుతంగా, పారదర్శకంగా డిసిసి అధ్యక్షులను ఎంపిక చేస్తుందని అ న్నారు. సంఘటన్ సృజన్ అభి యాన్ కార్యక్రమంలో డిసిసి అధ్య క్షులు ఎంపిక సమావేశాలు నిర్వహి స్తున్నట్లు తెలిపారు. పార్టీలో ఎవరై నా డిసిసి అధ్యక్షుని కోసం దరఖా స్తు చేసుకోవచ్చన్నారు.
డిసిసి అభ్యర్థి ఎంపికకు సంబం ధించి పార్టీ శ్రేణులు వ్యక్తిగతంగా కా నీ,సమిష్టిగా కానీ తమ అభిప్రా యాలను వెల్లడించవచ్చని తెలిపా రు. ఈ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, తుంగతుర్తి మండల అధ్యక్షుడు దొంగరి గోవ ర్ధన్, జిల్లా మహిళా కమిటీ అధ్య క్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు,పీసీసీ అధికార ప్రతిని ధి అన్నే పర్తి జ్ఞాన సుందర్, పీసీసీ సభ్యులు గుడిపాటి నరసయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధ ర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమి టీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంక న్న,రాష్ట్ర నాయకులు తండు శ్రీని వాస్ యాదవ్, యోగానంద చా ర్యులు, ఆకుల బుచ్చిబాబు, పి సి సి, డిసిసి కార్యవర్గ సభ్యులు,9 మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, సంవిధాన్, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పా ర్టీ జిల్లా నియోజకవర్గ మండల గ్రా మ నాయకులు కార్యకర్తలు తదిత రులు పాల్గొన్నారు.