Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Harish : కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో మరణమృదంగం

–20 నెలల పాలనలో 93 మంది విద్యార్థుల మృతి
–స్వయంగా మానిటర్ చేస్తానన్న సీఎం మాటలు నీటి మూటలు
–మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్ర హం

Minister Harish : ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని గురుకులాల్లో మర ణ మృదంగం మోగుతోందని , 20 నెలల కాంగ్రెస్ ప్రజా పాలనలో 93 మంది గురుకులాల విద్యార్థులు మృత్యువాత పడ్డారని మాజీమంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశా రు. హన్మకొండ ధర్మసాగర్ మం డలం కరుణా పురం మహాత్మా జ్యో తి బాపూలే బాలుర గురుకుల కళా శాలలో విద్యార్థి మృతి చెందిందని,
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్ప ల్ మండలం తుప్రాన్ పేట బీసీ బా లికల గురుకుల పాఠశాలలో విద్యా ర్థిని ఆత్మహత్య చేసుకుందని, క్ర మంలో తాజాగా నల్గొండ జిల్లా దేవ రకొండ ఎస్టీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్, 15 మంది విద్యా ర్థులు ఆసుపత్రి పాలయ్యారని తెలి పారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం బీసీ గురుకులంలో పు రుగులన్నం మాకొద్దు అంటూ రోడ్డె క్కిన విద్యార్థులు ఇలా ఒక్కో గురు కులంలో వరుస సంఘటన జరు గు తున్నప్పటికీ గురుకులాల్లో జ రుగు తున్న మరణ మృదంగానికి ఎవరు బాధ్యులు రేవంత్ రెడ్డి అంటూ ప్ర శ్నల వర్షం కురిపించారు.

గురుకులాల ఖ్యాతి నానాటికి దిగ జారుతున్నదంటే దానికి కారకులు ఎవరు రేవంత్ రెడ్డి , విద్యార్థులకు కడుపు నిండా అన్నం కూడా పెట్ట లేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని ఎదురుదాడి చేశారు.
బిఆర్ఎస్ పాలనలో దేశానికే ఆద ర్శమైన గురుకులాలు, రేవంత్ పా లనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవు తుండటం దారుణమని వ్యాఖ్యా నించారు.

హరీష్ రావు చేసిన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే. విద్యావ్యవస్థ పట్ల కాం గ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్నది. గురుకులాలపై స్వ యంగా తానే మానిటరింగ్ చేస్తాన ని రేవంత్ రెడ్డి ప్రకటించి నెలలు గ డుస్తున్నా గురుకులాల దుస్థితి మా త్రం మారలేదు. విద్యాసంవత్సరం మొదలైందంటే పిల్లలు బడికి వెళ్లి చదువుకుంటారని సంబుర పడా ల్సింది పోయి, వారి ప్రాణాల గురిం చి ఆందోళన చెందాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు వచ్చింది.

గురుకులాల్లో వరుసగా చనిపోతు న్న విద్యార్థుల వార్తలు విని ఊళ్లలో ని తల్లిదండ్రులు భయపడుతున్నా రు. 20నెలల కాంగ్రెస్ పాలనలో 93 మంది విద్యార్థులు మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయం.
విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. భావి తెలంగాణ భవిష్యత్తును కాం గ్రెస్ ప్రభుత్వం బలిపెడుతున్నది.
నాడు దేశానికి దిక్సూచిలా నిలిచిన తెలంగాణ విద్యావ్యవస్థ, నేడు ది క్కుతోచని స్థితికి చేరింది. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి?
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ గురుకులాలకు మెస్‌ చా ర్జీలను చెల్లించేందుకు గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు ప లికి ఏడాది గడిచింది తప్ప అమలు జరగలేదు.

ఉడకని అన్నం, నీళ్ళ చారు, నాణ్య త లేని పప్పు తినకలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాం ట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక గు డ్లు, పండ్లు విద్యార్థులు అందించని పరిస్థితి. ఇంకెన్ని రోజులు విద్యార్థు లు పస్తులుండాలి, ఇంకెన్ని రోజులు గొడ్డు కారం అన్నం తిని కడుపు నిం పుకోవాలి.గురుకులాల్లో విద్యార్థు లకు నాణ్యమైన ఆహారం అందిం చాలని, ఫుడ్ పాయిజన్ నిరోధిం చాలని, ఆత్మహత్యలు జరగకుండా తక్షణం చర్యలు చేపట్టాలని బి ఆర్ ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.