**సార్వత్రిక సమ్మెలో.. మామిడి రమేష్.
General Strike : శాలిగౌరారం జూలై 9. : శాలిగౌరారం లో సార్వత్రిక సమ్మె జరిగింది. ఈ సమ్మెలో పాల్గొన్న బిఆర్టియు మండల అధ్యక్షుడు మామిడి రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నీరుగారిచే ప్రయత్నం చేస్తుంది, ఇప్పటికే 49 కార్మిక చట్టాలను 19 కి కుదించి, ఆ 19 చట్టాలను నాలుగు కోడ్ లుగ చేసిందన్నారు.
శాలిగౌరారం మండలంలోని జరిగిన సమ్మె లో అన్ని గ్రామాల ఆటో డ్రైవర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్,అంగన్వాడీలు ఆశా వర్కర్లు గ్రామపంచాయతీ కార్మికులు, వైద్యరంగ కార్మికులు, అన్ని రంగాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చలకాని మల్లయ్య,వేముల శంకర్, సిఐటియు నాయకులు గుండ్లపల్లి వెంకన్న,యేశబోయిన వెంకన్న , ఆశ వర్కర్ల సంఘం నాయకులు బల్లెం నవనీత,గుండ్ల సైదమ్మ, బి ఆర్ టి యు నాయకులు రాచకొండ గణేష్. గ్రామపంచాయతీ కార్మికుల సంఘం నాయకులు వంగూరి మన్సూర్ ,మక్క బుచ్చి రాములు, సిరిపురం అంజి, దేవ చిత్రం తదితరులు పాల్గొన్నారు..