Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputy CM Batti Vikramarka: పోలీస్ లు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి

–జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహించాలి
–ప్రజలకు ముందస్తుగా అవగాహ న కల్పించి మాక్ డ్రిల్ చేపట్టాలి
–ఇతర రాష్ట్రాల్లోని ప్రజల కోసం తె లంగాణ భవన్ లో కంట్రోల్ రూమ్
–హై లెవెల్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Deputy CM Batti Vikramarka: ప్రజా దీవెన, హైదరాబాద్: యుద్ధ వాతావరణం సందర్భంగా ఉత్పన్న మయ్యే పరిస్థితులను ఎదుర్కొనేం దుకు పోలీస్ అధికారులు సమగ్ర మైన కార్యాచరణ ప్రణాళిక రూ పొందించుకొని ముందుకు వెళ్లాల ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సూచించారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివా ల యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మల్లు అధ్యక్షతన హైలెవె ల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తోపా టు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎంఓ స్పెషల్ సిఎస్ జయేష్ రం జన్,డిజిపి జితేందర్, డిజీ ఇంటెలి జెన్స్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సి పి సివి ఆనంద్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సిపి సుధీర్ బాబు తదితరులు పాల్గొ న్నారు.

ప్రజల్లో జాతీయవాదాన్ని పెంపొం దించడానికి రాష్ట్రంలోని అన్ని జి ల్లా కేంద్రాల్లో అన్ని వర్గాల ప్రజలతో సంఘీభావ ర్యాలీని నిర్వహించాల ని అందుకు అనుగుణంగా కార్యక్ర మాలు రూపొందించుకోవాలని సిఎ స్ రామకృష్ణారావును ఆదేశించా రు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వ ర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిన్న నిర్వహించిన సంఘీభావ ర్యా లీ సమాజానికి మంచి సంకేతాన్ని ఇచ్చిందని అభిప్రాయపడ్డారు.
సున్నితమైన అంశాల గురించి సో షల్ మీడియాలో తప్పుడు ప్రచా రం కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేసి కట్టడి చేయాలి. తప్పుడు ప్ర చారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు.

24 గంటల ముందే ప్రజలను అప్ర మత్తం చేసి మాక్ డ్రిల్ ట్రయల్ ని ర్వహించాలని అధికారులకు డి ప్యూటీ సీఎం సూచించారు.అత్య వసర విభాగాల్లో పనిచేస్తున్న ఉ ద్యోగుల సెలవులను రద్దుచేసి వారి హెడ్ క్వార్టర్ లో ఉండే విధంగా చ ర్యలు తీసుకోవాలి, వార్తా ప్రచారా ల్లో తగు జాగ్రత్తల కోసం మీడియా అధిపతులతో సమావేశం నిర్వ హించాలని అధికారులను ఆదేశిం చారు.

యుద్ధ వాతావరణం సందర్భంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎ దుర్కొనేందుకు పోలీస్ అధికా రు లు సమగ్రంగా యాక్షన్ ప్లాన్ రూ పొందించుకొని ముందుకు వెళ్లాల ని సూచించారు. హైదరాబాదులో సైరన్ అలర్ట్ ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అం దుకు సంబంధించిన పరికరాలు ఎ క్కడున్నా కొనుగోలు చేయాలని డి ప్యూటీ సీఎం సూచించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రం లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వ హించినట్లు చెప్పారు. దేశ రక్షణలో కీలక పాత్ర వహిస్తున్న రక్షణ శాఖ కు సంబంధించిన పరికరాల తయా రీకి సంబంధించిన పరిశ్రమల వద్ద కట్టుదితమైన భద్రతను ఏర్పాటు చేశామని మాక్ డ్రిల్ లో వీళ్ళంద ర్నీ కూడా భాగస్వాములు చేశామ ని తెలిపారు.

ఆస్పత్రి భవనాల స్లాబు పైన ఎ రు పు రంగుతో ప్లస్ గుర్తును ఏర్పా టు చేసుకోవాలని అన్ని ఆసు ప త్రులకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు.అత్యవసర నిధు లు సమకూర్చుకోవడం పోలీస్ క మాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జ నాలను అప్రమత్తం చేయడం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను ఎ ప్పటికప్పుడు పాటిస్తూ క్షేత్రస్థాయి లో అమలు చేస్తున్నట్టు సి‌ఎస్ రా మకృష్ణరావు వివరించారు.

రాష్ట్ర డిజిపి జితేందర్ రెడ్డి మాట్లా డుతూ రాజీవ్ గాంధీ ఇంటర్నేష నల్ ఎయిర్పోర్ట్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని, రైల్వే స్టేషన్స్ బస్టాండ్లు వద్ద భద్రత పెంచి నట్లు చెప్పారు. హైదరాబాదులో ఉ న్న డిఆర్డిఏ, డి ఆర్ డి ఓ, ఎన్ ఎఫ్ సి తదితర జాతీయ స్థాయి పరిశ్ర మల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 24/7 పెట్రోలిం గ్ నిర్వహిస్తూ సీసీటీవీల ద్వారా మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు.

సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్ర చారం కాకుండా సైబర్ టీంలను ఏ ర్పాటు చేసి ఎప్పటి కప్పుడు తప్పు డు వార్తలను కట్టడి చేయడంతో పా టు తప్పుడు సమాచారాన్ని ప్ర చారం చేసే వారిపై కేసులు నమో దు చేస్తున్నట్లు డి‌జి‌పి వివరించా రు.

కేవైసీ లేకుండా సిమ్ కార్డులు జారీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని సున్నితమైన ప్రాం తాల్లో భద్రతను పెంచామని వివ రించారు. రాష్ట్రంలో ఉత్పన్నమ య్యే అత్యవసర పరిస్థితిని ఎదు ర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు ముం దస్తుగా చేసుకున్నాము అనుమా నాస్పద వ్యక్తుల కదలికలపై రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచామని డి‌జి‌ పి తెలిపారు.

ఎప్పటికప్పుడు పరిస్థితులను అం చనా వేసి పర్యవేక్షణ చేయడానికి హైదరాబాద్ కేంద్రంగా కంట్రోల్ రూ మ్ ఏర్పాటు చేశాము, గతంలో కే సులు నమోదయి జైలు జీవితం అ నుభవించి విడుదలైన వారి కదలి కల పట్ల నిఘా పెంచామని వారి ప్ర తి కదలికను పరిశీలిస్తున్నట్లు చె ప్పారు.

ఉక్రెయిన్ దేశంలో యుద్ద౦ నేప థ్యంలో ప్రజలను అప్రమత్తం చేయ డానికి ప్రత్యేకంగా యాప్ రూపొం దించారని, అలాంటి యాప్ రాష్ట్రం లో తీసుకురావడం కోసం ఆలోచన చేస్తున్నట్లు సమావేశంలో డి‌జి‌పి వివరించారు.