Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputy CM Bhatti Vikra Mark Mallu : ప్రభుత్వం కీలక నిర్ణయం, పుప్పాల గూడ లో ఐటీ నాలెడ్జ్ హబ్

Deputy CM Bhatti Vikra Mark Mallu : ప్రజా దీవెన, హైదరాబాద్: పు ప్పా లగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటి నా లెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చే పట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మల్లు, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు అధికారులను ఆదేశించా రు. గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం లో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, పరిశ్రమల, రెవెన్యూ శాఖ కీలక అధికారులతో వారు సమావేశం నిర్వహించారు.

పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మె ల్యే లు, ఎంపీలు, ఐఏఎస్ అధికా రుల కోసం ప్రభుత్వం గతంలో స్థ లాలు కేటాయించింది. వీరితోపాటు రెవిన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ తదితర సొసైటీలకు సుమా రు 200 ఎకరాలకు పైచిలుకు భూ మిని ప్రభుత్వం కేటాయించింది. పుప్పాలగూడ పరిధిలో సొసైటీల కు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు సబ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ భూమికి పక్కనే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కు సంబంధించిన సు మారు 250 ఎకరాల విస్తీర్ణం ఉన్న ట్లుగా అధికారులు మంత్రుల దృష్టి కి తీసుకువచ్చారు. మొత్తంగా మొ దటి దశలో ఐటి నాలెడ్జ్ హబ్ అభి వృద్ధికి సుమారు 450 ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పారు. మొదటి దశలో ఏర్పాటు చేయబో తున్న ఐటీ హబ్ ద్వారా ఐదు లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని అధికారులు మం త్రుల బృందానికి సూచించారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగింది, ఆ తర్వాత నాలెడ్జ్ హబ్ ఏర్పాట యింది, ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రూపు దిద్దుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగాల్లో వచ్చిన ప్రతి మార్పులో హైదరాబాద్ భాగ స్వామి అయిందని, ఇప్పుడు కూ డా ఐటీ రంగంలో AI టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పును హైదరా బాద్ అందిపుచ్చుకోవాలని మం త్రుల సబ్ కమిటీ నిర్ణయించింది.

హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధిలో సుస్థిర స్థానాన్ని ఇప్పటికే సాధిం చింది, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదని ఆర్థిక వేత్తలు స్పష్టం చేసిన విషయాన్ని మంత్రులు చర్చించారు. అభివృద్ధి ని కొనసాగించే క్రమంలో పుప్పాల గూడలో 450 ఎకరాల్లో నాలెడ్జ్ హబ్ అభివృద్ధి చేస్తూ దశాబ్దాలు గా కొనసాగుతున్న హైదరాబాద్ ప్రగతిని వేగవంతం చేయాలని నిర్ణయించారు.