Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆం దోళన, పూరణ్ కుమార్ ఆత్మహత్య దారుణం, ఈ సంఘటన మానవ హక్కుల ఉల్లంఘన 

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హరియానా: తెలంగా ణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అ ధికారి వై.పూరన్ కుమార్ మరణం నన్ను తీవ్రంగా బాధించింది. ఇది ని జంగా చాలా దురదృష్టకర మైన ఘ టన అని డిప్యూటీ సీఎం భట్టివిక్ర మార్క మల్లు అన్నారు. సోమవా రం ఆయన ఇటీవల కుల వివక్ష భా వన, ఉన్నతాధికారుల మానసిక వే ధింపుల నేపథ్యంలో ఆత్మహత్య కు పాల్పడిన అడిషనల్ డీజీ పురణ్ కుమార్ కుటుంబాన్ని పరామ ర్శిం చారు. ఈ సందర్భంగా కుమార్ భా ర్య అమ్నీత్ ను రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించి సంఘీభావం తెలిపారు.పూరన్ కు మార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభు త్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భరోసా ఇచ్చారు.

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థానిక మీడియాతో మాట్లాడారు.

హరియాణాలో అదనపు డీజీ గా ప ని చేసిన ఆయన, అత్యంత ప్రతి ష్టాత్మకమైన ‘రా’ విభాగంలో కూడా సేవలందించారు అని తెలిపారు. ఉ త్తమ సేవలకు గాను రాష్ట్రపతి మె డళ్ళను కూడా అందుకున్న ప్రతి భా వంతులు ఆయన. అలాంటి గొప్ప అధికారి ఈ నెల 7 న ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచి వేసే అంశమని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.అంతకుముందు ఆ యన రాసిన మరణ వాగ్మూలం (సూసైడ్ నోట్) లో డీజీపీ కపూర్, ఎస్పీ నరేంద్ర అనే ఇద్దరు అధికారు లు తనను అడుగడుగునా అవ మానించి, వేధించడం వల్లే చనిపో తున్నానని స్పష్టంగా పేర్కొన్నారు అని తెలిపారు.

చట్టం ప్రకారం ఇలాంటి సాక్ష్యం ఉ న్నప్పుడు ప్రభుత్వం వెంటనే చర్య లు తీసుకోవాలి కదా అన్నారు. అ యితే, రోజులు ఏడు రోజులు గడు స్తున్నా హర్యానా ప్రభుత్వం, చండీ గఢ్ పోలీసులు నిందితులపై ఎలాం టి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. అంతేకాదు, ఆయ న శవపరీక్ష కూడా జరగలేదు. ఆ యన మృతదేహానికి ఇప్పటికీ పోస్ట్‌ మార్టం కూడా చేయకపోవడం, వృ ద్ధురాలైన ఆయన తల్లికి, భార్యకు, కూతుళ్లకు కనీశం శవాన్ని చూ డ టానికి కూడా అనుమతించక పోవ డం అత్యంత అమానుషం, దారుణ మన్నారు. ఇది మౌలిక మానవ హ క్కుల ఉల్లంఘన. నిందితులలో ఒ కరైన మిస్టర్ కపూర్‌పై అప్పటికే కు లవివక్ష ఆరోపణలు ఉన్నా, ఆ య నను ప్రభుత్వం డీజీపీగా కొన సా గించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వందేళ్లు దాటిన మనిషి కూడా మ రింతకాలం బతకాలి అనే కోరుకుం టాడు. చావుబ్రతుకుల్లో హాస్పిటల్ బెడ్డు మీద ఉన్నవారు కూడా ‘మా కు బతకాలని ఉంది… మమ్మల్ని కా పాడండి’ అని వైద్యులను వేడుకొం టారు. అలాంటిది ఒక ఐపీఎస్ స్థా యి అధికారి ఇక నేను బతకలేను అని చెప్పి ప్రాణం తీసుకున్నారంటే ఆయన ఎంత వేదన అనుభవించి ఉంటారో, ఎంత కష్టం ఆయనకు కలిగి ఉంటుందో ఊహించండని డి ప్యూటీ సీఎం వివరించారు. ఆయన ఎంతటి అవమానం అనుభవించా రో అర్థం ఒక ఐపీఎస్ అధికారికే ర క్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల గతి ఏమిటో ఆలోచించండన్నారు. మానవ హక్కుల సంఘాలు, పౌర సంఘాలు గడచిన వారం రోజులు గా న్యాయం కావాలని పోరాడుతు న్నాయి.

నిరసన తెలుపుతున్నాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరణ వా గ్మూలం ఆధారంగా చండీగఢ్ పో లీసులు తక్షణమే చర్యలు తీసు కు ని ఉండాల్సింది. నిందితులను అరె స్ట్ చేసి ఉండాల్సింది. కానీ వారు ఆ పని ఎందుకు చేయలేదు అని ప్ర శ్నించారు. చివరికి ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిందులను తక్షణం సస్పెండ్ చేయకుండా మౌనంగా ఉండటం తీవ్ర ఆక్షేపణీయం అన్నా రు. హర్యానా, చండీగఢ్ రెండూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిధి లో ఉన్నాయి. కాబట్టి ప్రధాని, హోం మంత్రి తమ రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలి అని డిమాండ్ చేశా రు.

మా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రే వంత్ రెడ్డి విషయం తెలిసిన వెంట నే పూరం కుమార్ కుటుంబ స భ్యు లతో మాట్లాడి, వారికి సంఘీభావం తెలిపారు.నన్ను తక్షణమే బాధితు లను కలవమని ఇక్కడికి పంపిం చారు. పూరన్ కుమార్ హైదరా బా ద్‌లోని ఉస్మానియాలో ఇంజనీరిం గ్, ఆ తరవాత ఐఐఎమ్‌లో ఉన్నత విద్యను అభ్యసించి, హర్యానాలో ఐపీఎస్ అధికారిగా సేవలు అం దిం చారు. ఆయన చాలా ప్రతిభాశాలి. ఆయన మరణం ఆయన కుటుం బానికి వ్యక్తిగతంగా పుదుకోలేని న ష్టమే కాదు, వ్యవస్థకు కూడా నష్ట మే అన్నారు.ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. ఇది మానవ హ క్కుల సమస్య ,ప్రతి ఒక్కరికి ఈ దే శంలో జీవించే హక్కు ఉంది. దాని ని ఎవ్వరూ కాదనలేరని తెలి పా రు.

కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అన్యాయాల ను సహించదు. చూస్తూ ఊరుకో దు. పూరన్ కుమార్ సూసైడ్ నోట్‌ లో పేర్కొన్న డీజీపీ కపూర్, ఎస్పీ న రేంద్రలను వెంటనే అరెస్ట్ చేసి, వా రిని చట్టపరంగా విచారించాలి. ఇది ప్రభుత్వ కనీస బాధ్యత. అలాగే, బాధిత కుటుంబానికి ఆయన భా ర్య, తల్లి, ఇద్దరు కూతుళ్లకు, పూర్తి రక్షణ, న్యాయం కల్పించాలి. ఈ వి షయంలో న్యాయం ఆలస్యం అయి తే , న్యాయాన్ని నిరాకరించినట్టే అ వుతుందని డిప్యూటీ సీఎం తెలి పారు. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక నైతిక పరీక్ష అన్నారు. డిప్యూటీ సీఎం వెంట ఏఐసిసి ఎస్సీ సెల్ అ ధ్యక్షుడు కొప్పుల రాజు, చండీగఢ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ hs లక్కీ, సంవి ధాన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్ తదితరులు ఉన్నారు.