Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్య, ప్రజాస్వామ్యాన్ని నిలబె ట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకం
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన హైదరాబాద్: సివిల్స్ లో తెలంగాణ నుంచి అత్యధిక సం ఖ్యలో అభ్యర్థులు ఎంపికవ్వాలనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మ ల్లు ఆకాంక్షించారు. సోమవారం ఆ యన ప్రజాభవన్ లో సింగరేణి ఆ ధ్వర్యంలో మెయిన్స్ కు ఎంపికైన 1 78 మందికి లక్ష రూపాయలు చొ ప్పున ఆర్థిక సహాయం అందించే కా ర్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంక టరెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ లతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడు తూ మానవ వనరులు అతి ముఖ్య మైనవి అవి బలమైన పెట్టుబడుల ని, ఆ మానవ వనరులను సానబ ట్టి వజ్రాలుగా తయారు చేస్తే సమా జానికి పెద్ద ఎత్తున ఉప యోగపడ తారని సీఎం రేవంత్ రెడ్డి నాయక త్వంలోని ప్రజా ప్రభుత్వం ఆలోచన చేసి సివిల్స్ కు సిద్ధమవుతున్న అ భ్యర్థులకు ఎంతో కొంత సాయం చే స్తే వారు లక్ష్యం సాధించేందుకు ఉ పయోగపడుతుందని ఈ కార్యక్ర మం చేపట్టినట్టు డిప్యూటీ సీఎం తె లిపారు. సివిల్స్ సాధించేందుకు సి ద్ధమవు తున్న అభ్యర్థులకు అన్ని విధాలుగా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అ భ్యర్థులకు మనోధైర్యం కల్పించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెం డో సంవత్సరం కార్యక్రమంలో చేప ట్టిందనీ డిప్యూటీ సీఎం తెలిపారు.
మెయిన్స్ కు ఎంపికైన 178 మం దికి లక్ష రూపాయల చొప్పున అంది స్తున్నాము. ఇంటర్వ్యూ కి ఎంపికైన వారికి కూడా లక్ష ఆర్థిక సాయం ఢి ల్లీలో వసతులు కల్పిస్తామని భరో సా ఇచ్చారు. మొదటి సంవత్సరం 148 మందికి ఆర్థిక సహాయం అం దించగా పదిమంది సివిల్ సర్వీస్ కి ఎంపికయ్యారని వివరించారు. ప్ర జాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకమని, ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి సి విల్ సర్వీసెస్ ద్వారా అవకాశముం టుందన్నారు. వేలాదిమంది రాష్ట్రం లో పనిచేసిన ఎస్సార్ శంకరన్, పా ర్థసారధి, మాధవరావు వంటి కొద్ది మంది పేర్లు మాత్రమే జనం గుండె ల్లో నిలిచిపోయారని అన్నారు. నిబ ద్ధత సేవలందిస్తే ప్రజల హృదయా ల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అ న్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకువ చ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమా లు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరవేస్తే నే ప్రభుత్వాలు ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. అధికారుల్లో చిత్తశుద్ధి లోపిస్తే ప్రభుత్వ లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా ఫలితం ఉం డదన్నారు. Sr శంకరన్ సాంఘిక సంక్షేమ శాఖలో సెక్రటరీగా ఉన్న ప్పుడు చేపట్టిన కార్యక్రమాలు ప్ర జల జీవన స్థితిగతులు మార్చడాని కి ఉపయోగపడ్డాయి అన్నారు. 45 వేలకు పైబడి ఉన్న సింగరేణి కార్మి కులు సింగరేణి సంస్థను బతికిస్తూ పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు మీ ప్రయత్నంలో వి జయం సాధించే క్రమంలో సింగరేణి కార్మికుల ఆశీస్సులు మీకు ఉంటా యని డిప్యూటీ సీఎం తెలిపారు.