Politicsతెలంగాణహైదరాబాద్

Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క వ్యాఖ్య, నాణేల పరంపరకు దక్షి ణ భారతం ప్రసిద్ధి 

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: న్యూ మి స్ మ్యాటిక్స్ (నాణేల అధ్యయ నం), వారసత్వ అధ్యయనాల్లో తె లంగాణ అగ్రస్థానంలో నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మ ల్లు అన్నారు. గురువారం ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో ఏర్పాటుచేసిన “coin age and economy of south eren india” (దక్షిణ భారతదేశ నాణేలు మరియు ఆర్థిక వ్యవస్థ)

అనే అంశంపై న్యూ మిస్ మ్యాటిక్స్ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ సె మినార్ లో ఆయన ముఖ్యఅతిథి గా హాజరై ప్రసంగించారు.

ఈ సదస్సు రెండు రోజులు జరిగే కార్యక్రమంగా మాత్రమే కాకుండా, ఒక చిచ్చరపిడుగులా కొత్త ఆలో చ నలను రగిలించే వేదిక కావాలని నా ఆశ అన్నారు. వివిధ సంస్థల మ ధ్య సహకారం పెరగాలి, యువ పరి శోధకులు అంతరశాస్త్రీయ అధ్యయ నాలపై దృష్టి పెట్టాలి, న్యూ మిస్ మ్యాటిక్స్, వారసత్వ అధ్యయనా ల్లో తెలంగాణ ముందంజలో నిల వాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించా రు. వారసత్వ ఆధారిత పరిశోధ న కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా క ట్టుబడి ఉంది. పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో మన రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనం, సంస్కృతి సంరక్షణ, జ్ఞాన ఉత్పత్తిలో కేంద్రీకృత హబ్‌గా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.

దక్షిణ భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత సమృద్ధిగా నాణేల పరంపర ఉంది అని డిప్యూటీ సీఎం తెలిపారు.

శాతవాహనులు, ఇక్ష్వాకులు తమ వాణిజ్య నెట్‌వర్క్‌లను నాణేల ద్వారా విస్తరించగా, కాకతీయుల నుండి విజయనగర సామ్రాజ్యపు వైభవం వరకు మన ప్రాంతపు నా ణేలు ఆవిష్కరణ, కళాత్మకత, నైపు ణ్యమైన రాజ్యపాలనకు ప్రతీకగా నిలిచాయని డిప్యూటీ సీఎం వివ రించారు. ఈ నాణేలు మనతో మా ట్లాడతాయి కొన్నిసార్లు బిగ్గరగా ఆ కాలపు పన్ను వ్యవస్థలు, ముద్రణ, సాంకేతికత, వాణిజ్య ప్రాధాన్యత లు, రాజకీయ దృక్పథం గురించి ఎ న్నో విషయాలను వివరిస్తాయని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

ఈ సదస్సు స్వతహాగానే చారిత్రా త్మకమైనది. వారసత్వ శాఖ ఇం తకు ముందు పురావస్తు & మ్యూజి యంల శాఖ114 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా నాణేలపై మాత్రమే స ర్వాంగ సుందరమైన జాతీయ సద స్సును నిర్వహించడం అభినందనీ యం అన్నారు.సామ్రాజ్యాలు ఉద యించడం మరియు ఆస్తమించడం చూసిన ఈ శాఖకు ఇది నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి అని డిప్యూటీ సీఎం అన్నారు.

ఈ సదస్సు తెలంగాణకే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకూ గర్వ కా రణం అన్నారు.న్యూ మిస్ మ్యా టిక్స్ అంటే చేతిలో పట్టుకునే చిన్న చిన్న లోహపు ముద్రల అధ్యయనం మాత్రమే అనిపించవచ్చు. కానీ ఒక నాణెం పైకి చూస్తే అది ఒక చిన్న ప్ర పంచమే కనిపిస్తుంది అన్నారు. నా ణేలు మన పురాతన “కంప్రెస్డ్ డే టా” లాంటివి అని తాను తరచూ భావిస్తుంటానని తెలిపారు. కొద్ది గ్రాముల లోహంలో ఆ కాలం ఆర్థిక వ్యవస్థ, రాజు ఆశయాలు, సాంకేతి క పరిజ్ఞానం, వాణిజ్య మార్గాలు, ధార్మిక చిహ్నాలు, దౌత్య సంబంధా లు అన్నీ అందులో నిక్షిప్తం అయి ఉంటాయి అన్నారు. పురావస్తు శా స్త్రవేత్తలు ZIP ఫైల్‌ను కనుక్కుంటే దానికి ‘కాయిన్’ అన్న పేరు పెట్టేవా రేమో అనిపిస్తుంది అని డిప్యూటీ సీఎం అన్నారు.

ఓఈ రోజుల్లో భారత్ డిజిటల్ చెల్లింపుల్లో, ఫింటెక్ ఆవిష్కరణల్లో ప్రపంచాన్ని నడిపిస్తున్న సమయం లో పద్ధెనిమిది పైసల కన్నా QR కో డ్‌లు ఎక్కువగా కనిపిస్తున్న సమ యంలో మన ఆర్థిక ప్రయాణం ఎం త దూరం వచ్చిందో ఈ సందర్భం మనకు గుర్తుచేస్తుందనీ తెలిపారు. వారసత్వం అంటే కేవలం వెనక్కి చూసుకోవడం కాదు నేటికీ ప్రభావం చూపుతున్న ఆలోచనల ఒక పెద్ద వలయం అర్థం చేసుకోవడమే అని తెలిపారు. నాణేలను అధ్యయనం చేయడం అంటే లోహాన్ని కాదు, ఆ లోచనను అధ్యయనం చేయడం అ ని డిప్యూటీ సీఎం అభివర్ణించారు.

తెలంగాణ నుండి ఒకే ఒక నాణెం మనకు ఎంత చరిత్ర చెబుతుందో తెలుసుకోవచ్చు అన్నారు. కోటి లింగలలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన శా తవాహన సీసపు నాణాన్ని కనుగొన్నారు చూడడానికి అది సాదాసీదాగా కనిపించేది కానీ లోతుగా చూస్తే అసాధారణమైనది అన్నారు. ఒక వైపు ఉజ్జయినీ చిహ్నం, నాలుగు చిన్న వృత్తాలు క్రాస్ ఆకారంలో, విశ్వ నియమం, నిరంతరతను సూచించే పురాతన భారత వాణిజ్య నెట్‌వర్క్‌లలో విస్తృతంగా ఉపయోగించిన చిహ్నం వంటివి ఉన్నాయి అన్నారు. మరో వైపు సరస్సు తీరానికి గోడలాగా లేదా స్తూప శైలి రైలింగ్ ఆకృతి దక్షిణ భారత బౌద్ధ కళలో కనిపించే ముద్ర అని వివరించారు. ఈ రెండు చిహ్నాల మధ్య ఒక బ్రాహ్మీ లిపి, ఒక శా తవాహన పాలకుడి పేరును సూచిస్తుంది నేటి తెలంగాణ ప్రాం తంలో వారి ఉనికికి ఉన్న తొలితర పు ఆధారాలలో ఇదొకటి అని డి ప్యూటీ సీఎం వివరించారు.

ఇలాంటి చిన్న నాణెం మనకు ఏమి చెబుతుంది అంటే? మొదట, తెలం గాణ పరధ్యాన ప్రాంతం కాదు, డె క్కన్ వాణిజ్య వ్యవస్థలో కీలక కేం ద్రం అనే విషయాన్ని స్పష్టం చేస్తుం దని డిప్యూటీ సీఎం తెలిపారు. రెం డవది రాజకీయ అధికారం, బౌద్ధం, వాణిజ్యం ఇవన్నీ ఎంతగా పరస్పరం అనుసంధానమై ఉన్నా యో చూపుతుంది అని వివరిం చారు. మూడవది ఈ నాణెం సీసం తో తయారు కావడం డెక్కన్‌లో ల భ్యమయ్యే లోహం మన పూర్వీ కు లు స్థానిక వనరుల ఆధారంగా అభి వృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను ఎంతో నైపుణ్యంగా నిర్మించారనేద నిర్మించారనేది సూచిస్తుందని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలి పారు.

ఈ ఒక్క నాణెంలోనే రాజకీయాలు, ఆధ్యాత్మికత, లోహశాస్త్రం, కళ, ఆర్థిక వ్యవస్థ వంటి అన్ని అంశాలు ఒకేచోట కలిసిపోయాయి అని వివ రించారు. ఆధునిక చరిత్రకారుడు ఈ చిన్న లోహపు ముక్క చెప్పే వి షయం చెప్పడానికి పేజీల తరబడి రాయాల్సి ఉంటుంది అన్నారు.

అందుకే ఇక్కడున్న పరిశోధకులు, విద్యార్థులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు ఆర్థిక శా స్త్రం, సంస్కృతి, లోహశాస్త్రం, చరిత్ర అన్ని కలిసే ఈ అద్భుత రంగాన్ని ఎంచుకున్నందుకు సబికులందరికీ అభినందనలు తెలిపారు.

సదస్సులో పాల్గొనే వారందరి మ ధ్య ఫలప్రదమైన చర్చలు, కొత్త స్నే హాలు, కొత్త అన్వేషణలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని డిప్యూటీ సీఎం తెలిపారు. మన శా స్త్రానికి, మన పూర్వీకుల చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ సదస్సు లు మరింత విలువ తీసుకురావాలి అని డిప్యూటీ సీఎం ఆకాంక్షించా రు. సమావేశంలో తెలంగాణ హెరి టేజ్ డైరెక్టర్ అర్జునరావు, న్యూ మి స్ మ్యాటిక్ ఇండియా సొసైటీ చై ర్మన్ డాక్టర్ డి. రాజారెడ్డి, న్యూ మిస్ మ్యాటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండి యా జనరల్ సెక్రెటరీలు ప్రొఫెసర్ పి.ఎన్. సింగ్, ప్రొఫెసర్ బింద ద త్తాత్రేయ, డిప్యూటీ డైరెక్టర్ నాగ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చందా ఎన్ ఎర్లీ హిస్టారిక్ సైట్ ఇన్ తెలంగాణ, ఆర్ట్, ఆర్కిటెక్చర్ మరియు ఐకోనోగ్రఫీ salvaged ఫ్రమ్ krishna-thung abhadra vally in the state of telangana, South indian fana ms, 106 annual conference of nsi journal ఇతర పుస్తకాలను వేదికపై ఉన్న ప్రముఖులతో కలిసి డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు.

Related Articles

Back to top button