–6 ఖండాలు 44 దేశాలు 154 మం ది ప్రతినిధులు రాక
–డిసెంబర్ 8న 1.30 గంటలకు ప్రా రంభం, 9న సాయంత్రం 6గంటలకు ముగింపు
–సమ్మిట్ ను ప్రారంభించనున్న రాష్ట్ర గవర్నర్
–మీడియా సమావేశంలో ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: ఈ నెల 8, 9 తారీఖుల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ – 2025 సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఇది పూ ర్తిగా ఎకనమిక్ సమ్మిట్ అని ఆయ న స్పష్టం చేశారు. 2047 నాటికి తె లంగాణ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ను సాధించడమే లక్ష్యంగా నిర్వహి స్తున్నట్లు పేర్కొన్నారు. నీతి అయో గ్, ఐఎస్బీ -హైదరాబాద్ సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరిగిందన్నారు. ఈనెల 8 న మధ్యాహ్నం 1:30 కు తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ 2025 సమ్మిట్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభిస్తా రని ఆయన చెప్పారు. ఫ్యూచర్ సి టీలో ఈ కార్యక్రమం నిర్వహించడం అత్యంత సంతోషకరంగా ఉంద న్నారు. ముఖ్యమంత్రి రేవంత రెడ్డి నాయకత్వంలోని మొత్తం కేబినెట్ అంతా కలిసి ఆలోచనలు చేసి వి జ న్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంత ర్జాయ స్థాయిలో పేరొందిన ఎకనమి స్టులు ప్రసంగిస్తారని ఉప ముఖ్య మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొదటి రోజు 8 న అభిజిత్ బెనర్జీ, ట్రంప్ డైరెక్టర్ ఆ ప్ ట్రంప్-మీడియా అండ్ టెక్నాల జీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడర్, శ్రీ ధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సిఎం డీ కె శివ కుమార్, నోబెల్ బహుమ తి గ్రహీత కైలాష్ సత్యార్థి, కిరణ్ మ జుందార్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను కూడా ప్రసంగిస్తానని భట్టి విక్రమా ర్క తెలిపారు. సమ్మిట్ ను ఉద్దేశిం చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మ ధ్యాహ్నం 2.30 నిమిషాలకు కీలక ప్రసంగం చేస్తారని ఆయన చెప్పా రు. గ్లోబెల్ సమ్మిట్ లో అనంతరం పలు డిపార్ట్మెంట్ లకు సంబం దిం చిన సెషన్స్ ఉంటాయని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 వరకు సెషన్ లు ప్రారంభం అవుతా యి. సెషన్ అంశం కి సంబంధించిన శాఖ మంత్రి ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్ర టరీలు పాల్గొంటారు. ఈ సెషన్స్ లో ఎక్స్ పర్ట్స్ పాల్గొంటారు. 9వ తేదీ కూడా ఇలాగే సెషన్స్ ఉంటాయి.
ఉదయం 9 గంటలకు కార్యక్రమా లు మొదలవుతాయి. సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ముగింపు కార్యక్రమం లో ఎవరెవరు పాల్గొంటారో తరువా త తెలియజేస్తామని చెప్పారు. తె లంగాణ రైజింగ్ గ్లొబెల్ సమ్మిట్ లో 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 1 54 మంది ప్రతినిధులు పాల్గొంటు న్నట్లు ఉప ముఖ్యమంత్రి వివరిం చారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నట్లు భట్టి విక్రమార్క వి వరించారు. రాష్ట్రంలోని అన్ని రాజ కీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. స్వయంగా అధికారులే వెళ్లి వారిని ఆహ్వానిం చడం జరుగుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను, సహచర మంత్రులు అందరం స్వ యంగా వెళ్లి ముఖ్యులను ఆహ్వా నించడం జరిగిందని భట్టి విక్రమా ర్క అన్నారు. అన్ని రాష్ట్రాలకు స మాచారం ఉండాలి అని.. అందరిని పిలవడం జరిగిందన్నారు. తెలంగా ణ రైజింగ్ గ్లోబెల్ సమ్మిట్ – 2025 అనేది ప్రత్యేక సమ్మిట్. ఇన్వెస్టర్లు రాష్ట్రానికి రావాలన్న సదుద్దేశంతో చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్ కి సంబంధించినదిగా ఆయన అభివ ర్ణించారు. ఈ ఎకనమిక్ సమ్మిట్ రా ష్ట్ర ప్రయోజనాలకు ఎతంగానో ఉ పయోగ పడుతుందని అన్నారు. ఎ వరి స్థాయిలో వాళ్ళు సమ్మిట్ సక్సె స్ కి సహకరించాలని ఆయన పి లుపునిచ్చారు.
ఎయిర్ లైన్స్ సమస్యకు వెసులుబా టు కలుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏమైనా ఇ బ్బందులు తలెత్తితు ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ముఖ్యమైన వారికి ఇబ్బంది తలెత్తి తే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తా మని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క అన్నారు.
