Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputy CM Bhatti Vikramarka Mallu: తెలంగాణ బిల్డర్స్ కు సంపూర్ణ సహకారం

–బిల్డర్స్ కు స్వర్గధామంలా భాగ్యనగరం
–గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధానపరమైన నిర్ణయం
–నగరంలో దశలవారీగా ఎలక్ట్రిక ల్ వాహనాలు నడుపుతం
–ఆధునిక దేశాల బాటలో రాష్ట్రా న్ని మందుకు నడిపిస్తాం
–బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Deputy CM Bhatti Vikramarka Mallu: ప్రజా దీవెన, హైదరాబాద్: బిల్డర్స్, డెవలపర్స్ ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూ స్తుందని,రాష్ట్ర అభివృద్ధిలో భాగ స్వాములుగా వారికి రాష్ట్ర ప్రభు త్వం సంపూర్ణ సహకారం అంది స్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మల్లు అన్నారు. శనివారం నోవాటేలో జరిగిన తెలంగాణ బిల్డర్స్ గ్రీన్ సమ్మిట్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిం చారు. బిల్డర్స్ కు ఎలాంటి ఇబ్బం దులు లేని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఎవ రైనా తప్పుడు ప్రచారాలు చేసి బిల్డ ర్స్, డెవలపర్స్ ను ఇబ్బంది పెట్టే పని చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని తెలిపారు. రాష్ట్ర అభివృ ద్ధికి తోడ్పడే వ్యక్తులుగా బిల్డర్ కు సంపూర్ణ సహకారం అందిస్తాం, బిల్డ ర్స్కు హైదరాబాద్ స్వర్గధా మం లాంటిదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఒక యువ రాష్ట్రం, ప్రపంచ పటంలో రైజింగ్ గా కనిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతుందని తెలిపారు.

నెట్ జీరో సిటీ ఒప్పం దం చేసుకొని హైదరాబాద్ ప్రపం చానికి ఒక సందేశం ఇస్తుంది అన్నా రు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలం గాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెం దుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎ లాంటి నిర్ణయాలు తీసుకుంటుం దని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదు రుచూస్తుందని తెలిపారు. ఈ నేప థ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి నిర్ణయాలు తీసుకుం టున్న ట్టు తెలిపారు. హైదరాబాదును గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకుంటున్నా మని, ఢిల్లీ ప్రజలు స్థానికంగా ఉం డేందుకు ఇబ్బందులు పడుతున్నా రు ఒక సీజన్లో అక్కడి నుంచి పౌరు లు వలస వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఆ దుస్థితి హైదరాబా ద్ కు రాకుండా ఉండేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు తెలి పారు. హైదరాబాద్ నగరంలోని డీజిల్ వాహనాలను దశలవారీ ఎలక్ట్రికల్ వాహనాలుగా మారుస్తు న్నట్టు తెలిపారు. ఎలక్ట్రికల్ వాహ నాల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని కోల్పోయి రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించేందుకు కూడా వెనుకాడ లేదని తెలిపారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాదును తీర్చి దిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

ఆదాయం కంటే హైదరా బాద్ నగర ప్రజల ఆరోగ్యమే మా కు ప్రధానం అన్నారు. ప్రపంచ కేంద్రంగా ఫోర్త్ సిటీని తీర్చి దిద్దు తామన్నారు. నెట్ జీరో సిటీ నిర్మా ణంలో భాగంగా ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందు లు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుందని వివరించారు. మూసి పునర్జీవనం రాష్ట్ర చరిత్రలో ఒక మైలు రాయి, దశాబ్ద కాలంగా కాలుష్య కాసారంతో ప్రజలు జీవిం చడానికి ఇబ్బంది పడుతున్నారు.. ఈ నదిలో పరిశుభ్రమైన నీరు పారించి మూసి హైదరాబాద్కు ఒక వరంలా మారుస్తాము, హైదరాబా దును అద్భుత నగరంగా తీర్చిది ద్దుతామన్నారు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత ఖ ర్చు అయినా ముందుకు వెళ్లేందు కు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసు కుందని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టుబడులకు సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మం త్రి శ్రీధర్ బాబులు దావోస్లో పర్య టించి 1.80 లక్షల కోట్ల పెట్టుబడు లు ఆకర్షించారని వివరించారు.

2029-30 కి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా కొత్త విద్యుత్ పాలసీలో స్పష్టం చేశా మని, 35 నాటికి 40 వేల మెగావా ట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముం దుకు పోతున్నట్టు తెలిపారు. ఆధునిక దేశాల బాటలో తెలంగా ణను నడిపించేందుకు కేవలం అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాదు నగరానికి ఒక ఏడా దిలో పదివేల కోట్లు కేటాయించి నట్లు తెలిపారు. ఈ నిర్ణయం హైద రాబాదును ఉన్నత స్థానానికి తీసుకువెళ్లిందని తెలిపారు.