Praja Deveena
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 9:42 am Posted by : praja deveena

Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క వ్యాఖ్య, పెట్టుబడులకు ఆవిష్కర ణలుతోడైతేనే 3ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధ్యం 

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: పెట్టుబ డులకు ఆవిష్కరణలు తోడైతేనే త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యసా ధన సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నా రు. రాబోయే 22 ఏళ్లలో నిర్దేశించు కున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్ర స్తుతం ఉన్న అంచనాల ప్రకారం లె క్కిస్తే 16 రెట్లు ఆర్థిక వృద్ధిని సాధిం చాల్సి ఉందని తెలిపారు. మంగళ వారం గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఏర్పాటుచేసిన క్యాపిటల్ , ప్రోడక్టి విటీ ఫర్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకా నమీ చర్చా గోష్టిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్యఅ తి థిగా హాజరై ప్రసంగించారు.

మేము ‘తెలంగాణ రైజింగ్ 2047’ ను ఆవిష్కరించాము. ఇది కేవలం ఒక పత్రం కాదు… ఇది మన భవి ష్యత్తుకి ఇచ్చిన ప్రతిజ్ఞ అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలి యన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలప డం అనే మహత్తర లక్ష్యాన్ని నిర్ణ యించుకున్నామని తెలిపారు. కానీ పేజీలపై లక్ష్యాలు రాయడం సుల భం. అసలైన ప్రశ్న? నన్ను ఆలోచన లో పడేసే ప్రశ్న? ‘ఎలా?’ అనేదే అ ని వివరించారు.మనం ఎక్కువగా పనిచేస్తేనే 3 ట్రిలియన్ డాలర్ల ఆ ర్థిక వ్యవస్థను చేరుకోలేం, మరిన్ని రోడ్లు, పెద్ద సంఖ్యలో భవనాలు ని ర్మించడం మాత్రమే సరిపోదు,అవి చేస్తాం, కాని అవి మాత్రమే కాదు. ఈ విప్లవాత్మక వృద్ధిని సాధించాలం టే, మన ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రా థమిక సమీకరణాన్ని మార్చాల్సిం దే అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశా రు.

ఆ సమీకరణ చాలా సులభం: మూ లధనం + ఆవిష్కరణ = ఉత్పాదక త అని ఆవిష్కరణల ప్రాధాన్యత ను జోడించారు.ఉత్పాదకతే తెలం గాణ సాధారణ పౌరుడి వేతనాలు, గౌరవాన్ని శాశ్వతంగా పెంచే ఏకైక మార్గం అని డిప్యూటీ సీఎం వివరిం చారు. ఎన్నేళ్లుగా భారతదేశంలోని ప్రభుత్వాలు తమను ‘రెగ్యులేట ర్లు’గా మాత్రమే భావించాయి. అను మతులు, లైసెన్సులు, ఫైళ్లకే ప్రాము ఖ్యత ఇచ్చాయి. ‘ఈజ్ ఆఫ్ డూ యింగ్ బిజినెస్’లో ర్యాంకులు పె రి గితే సంతోషపడ్డాం అని తెలిపారు.

కానీ ప్రపంచం చాలా వేగంగా మారింది.

డీప్‌టెక్, ఏఐ, క్వాంటమ్ కంప్యూ టింగ్ యుగంలో ‘ఈజ్ ఆఫ్ డూ యింగ్ బిజినెస్’ అనేది కేవలం కనీ స అర్హత, అది ఒక బేస్‌లైన్ మాత్ర మే అని అన్నారు. ఆసియాలో ఇ న్నోవేషన్ క్యాపిటల్ కావాలంటే, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుండి ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు సాగాలి. ఫైళ్లు క్లియర్ చేయ డమే కాదు… ఎకోసిస్టమ్‌లను క్రియే ట్ చేసే ప్రభుత్వం కావాలి అని తెలి పారు. మన విజన్ డాక్యుమెంట్ C URE (అర్బన్), PURE (పెరి-అ ర్బ న్), RARE (రూరల్) అనే స్పేషియ ల్ స్ట్రాటజీని ప్రతిపాదించిందని వి వరించారు. మన దగ్గర ప్రణాళిక ఉంది. ప్రతిభ ఉంది. కానీ ఇన్నోవేష న్ ఖరీదైనది. ముఖ్యంగా ఇన్నోవేష న్ అంటే రిస్క్ ఉంటుంది అని తెలి పారు.

బ్యాంకులు సేఫ్టీని ఇష్టపడతాయి. కానీ ఇన్నోవేషన్‌కు ఫెయిల్యూర్ అ వసరం అని వివరించారు. ఇంటర్నె ట్ నుండి స్పేస్ ట్రావెల్ వరకు

అత్యంత పెద్ద బ్రేక్‌థ్రూ‌లు దశాబ్దాల పాటు లాభం లేకపోయినా, ఎవరై నా ఒక రిస్క్ తీసుకున్నప్పుడు మా త్రమే సాధ్యమయ్యాయి అని ప్రపం చ చరిత్ర చెబుతుంది అని డిప్యూ టీ సీఎం తెలిపారు.అందుకే ఈరో జు మా ప్యానెల్ ఎదుట ఉన్న అస లు ప్రశ్న: ఆ క్యాపిటల్‌ను ఎలా అ న్‌లాక్ చేయాలి?మేము ఒక రాష్ట్రం గా మారడానికి సిద్ధంగా ఉన్నాం. రెగ్యులేటర్‌గా కాకుండా, రిస్క్‌ను పంచుకునే ‘క్యాటలిస్ట్’గా మారడా నికి సిద్ధంగా ఉన్నాం అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రజల కోసం రివార్డులు పొందే భాగస్వామిగా మారడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఈరోజు నేను మాట్లాడటానికి మా త్రమే రాలేదు… వినడానికి వచ్చా ను, ఇక్కడ పెట్టుబడిదారులు, పా లసీ మేకర్లు, ఎంట్రప్రెన్యూర్లు ఉన్న అద్భుతమైన ప్యానెల్ ఉంది. కాబ ట్టి నేరుగా అసలు విషయానికి వ స్తాను అన్నారు.మూడు ముఖ్య మైన ప్రశ్నలు ఉన్నాయి. “ఉత్పా దకత vs ఉద్యోగాలు” అనే పర స్పర విరుద్ధ భావన ఉత్పాదకత పెరుగుదల అంటే ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు తగ్గిపోతాయని భయం ఉంది. దీన్ని ఎలా ఎదుర్కొంటాం?

ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడంలో ప్రభుత్వ అసలు పాత్ర ఏమిటి?

మేము ‘స్లో-మూవింగ్’ వ్యవస్థగా విమర్శలు ఎదుర్కొంటున్నాం అ న్నారు. అసలు ప్రభుత్వం దూరంగా ఉండాలా? లేక ఇన్నోవేషన్‌లో భాగ స్వామి కావాలా, AI, Deep Tech అంటే మనం ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే ఊహిస్తాం.కానీ మన విజ న్‌లో RARE (రూరల్) జోన్‌కు ము ఖ్య స్థానం ఉంది అన్నారు.డీప్‌టెక్ సైబరాబాద్‌లోనే కాకుండా, వరం గ ల్, నిజామాబాద్ రైతుల ఉత్పాదక త పెంచే ‘బోరింగ్ ప్రాబ్లమ్స్’ను కూ డా ఎలా పరిష్కరించేలా చేసుకోవా లి? ఈ రంగాల్లో క్యాపిటల్‌ను ఎలా ఆకర్షించాలి? అన్న అంశాలపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం సూచిం చారు.

చర్చా గోష్టి లో సెంటర్ ఫర్ ఎన లై టికల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న తంత్రి, యువ పారిశ్రామిక వేత్త పర శురాం, ట్రాన్స్ కో సిఎండి కృష్ణ భా స్కర్ తదితరులు పాల్గొన్నారు.

*ఘనంగా రెండవ రోజు తెలం గాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ 20 47* …

తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ -2047 లో భాగంగా తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సదస్సు లో రా ష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మం త్రి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో క్రీడా విధానంలో సంస్కరణలు తీసుకొస్తూ క్రీడా పాలసీని ప్రకటించ డం జరిగిందని తెలిపారు. 2036 ఒ లంపిక్స్ లో అంతర్జాతీయస్థాయి పోటీలో తెలంగాణ క్రీడాకారుల ప్రా తినిధ్యం పెంచే లక్ష్యంగా పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పెద్దలతో కమిటీ సభ్యులు గా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ను ఏ ర్పాటు చేశామన్నారు. తెలంగాణ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా నిధుల సమీకరణ కోసం స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ను ఏ ర్పాటు చేయడం జరిగిందని తెలి పారు.

యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకే షన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని నూ తనంగా ఏర్పాటు చేశామని మంత్రి తెలియజేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా పాఠశాల స్థాయి నుండే క్రీడా వ్యవస్థ బలోపే తానికి కృషి చేస్తున్నామన్నారు. అ దేవిధంగా బాలికలకు, పారా అథ్లె ట్ ల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్లోని క్రీడాకారులు అం తర్జాతీయ స్థాయిలో రాణించేం దు కు లౌబరో యూనివర్సిటీ, కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ వంటి సంస్థలను భాగస్వాములుగా చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపా రు.

తెలంగాణలోనే 119 నియోజకవ ర్గాల్లో మినీ స్టేడియాలు, గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. వెయ్యి ఎకరాల్లో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేసి తద్వారా ఒలంపిక్, అంతర్జాతీ య స్థాయి క్రీడా ఈవెంట్లకు ఆతిథ్య కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్ద డమే లక్ష్యమన్నారు. స్పోర్ట్స్- టెక్ స్టార్టప్ లు టూరిజం లాంటివి అన్నీ టీ- హబ్, టి.ఎస్- ఐ పాస్ భాగస్వా మ్యంతో ముందుకు సాగుతున్నా యన్నారు. అథ్లెట్ ల సంక్షేమానికి మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇ స్తుందని తెలిపారు. వారికోసం గ్రే డె డ్ ఇంటెన్సివ్ లు, ఇన్సూరెన్సు, గు రువందనం లాంటి స్కీములు ప్రవే శపెట్టడం జరిగిందని తెలిపారు.

క్రీడా వ్యవస్థను బలోపేతం చేయ డం కోసం కోచింగ్ మౌలిక సదుపా యాలు ఇన్నోవేషన్ అథ్లెట్ డెవల ప్మెంట్ రంగాల్లో తోడ్పాటుకు భాగ స్వాములు కావడానికి ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నామన్నారు.

ఈ సదస్సులో మైనారిటీ శాఖ మం త్రి, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్, తెలంగాణ ఒలం పిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ.పీ జితేందర్ రెడ్డి,స్పోర్ట్స్ అథారిటీ ఆ ఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, మాజీ క్రికెటర్లు అనిల్ కుం బ్లె,అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్ పీ.వీ సింధు, జ్వాలా గుత్తా, స్పోర్ట్స్ సీని యర్ జర్నలిస్ట్ బాలా మజుం దార్, స్పోర్ట్స్ హబ్ మెంబర్ వితా దాని తదితరులు పాల్గొన్నారు.