Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క ప్రకటన, తెలంగాణలో మూడుట్రి లియన్ల ఆర్థిక వ్యవస్థయేమాలక్ష్యం

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రైజింగ్- 2047, మూడు ట్రిలియ న్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలం గాణ యువ రాష్ట్రం వేగంగా పరు గులుతీస్తోందని డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురు వారం ఆయన గచ్చిబౌలిలోని ఇండి యన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (isb) లో మోతిలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటి వ్ సెంటర్ ప్రారంభోత్సవం అనంత రం ప్రసంగించారు. యువ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడుతుంది రాష్ట్ర అభివృద్ధికి ISB విద్యార్థులు సహ కరించాలని డిప్యూటీ సీఎం కోరా రు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ఎవరు ఊహించని రీతిలో పెట్టు బ డులు పెడుతుందని తెలిపారు.

విద్య పై పెట్టుబడి రాష్ట్ర నిర్మాణా నికి ఉపయోగపడుతుందని ప్రజా ప్రభుత్వం సంపూర్ణంగా భావిస్తుంద ని వివరించారు. రాష్ట్ర విద్యార్థుల కు ప్రపంచ స్థాయి విద్యను పూర్తి గా ఉచితంగా అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభి స్తు న్నామన్నారు. 25 ఎకరాల విస్తీర్ణం లో 200 కోట్ల పెట్టుబడితో ఒక్కో పాఠశాల నిర్మిస్తున్నాం, రాష్ట్రవ్యా ప్తంగా ఒకేసారి 104 పాఠశాలల నిర్మాణం ప్రారంభించినట్టు వివ రిం చారు.

విద్యార్థులు కళాశాల బయటికి వె ళ్ళగానే ఉద్యోగం పొందేలా స్కిల్ యూనివర్సిటీలో సిలబస్ రూపొం దించి అమలు చేస్తున్నట్టు తెలిపా రు. స్కిల్ యూనివర్సిటీలో సిలబ స్ ఎలా ఉండాలి అనేది పారిశ్రామి కవేత్తలతో మాట్లాడి డిజైన్ చేసిన ట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. తె లంగాణ సాయుధ పోరాటంలో పా ల్గొన్న చాకలి ఐలమ్మ పేరిట మ హి ళా యూనివర్సిటీ భవనాల నిర్మా ణానికి రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆనం ద్ మహీంద్రా వంటి దిగ్గజాన్ని చైర్మ న్ గా నియమించి స్కిల్ యూని వ ర్సిటీ ఏర్పాటు చేశామని ఐఎస్ బి నిర్వాహకులు స్కిల్ యూనివర్సి టీ ని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను సందర్శించి వాటికి అ వసరమైన సలహాలు సూచనలు ఇ వ్వాలని డిప్యూటీ సీఎం కోరారు.

అవి ప్రారంభ దశలో ఉన్నందున ఇ ప్పుడు ఐఎస్ బి నుంచి సూచన లు అందితే అది రాష్ట్ర భవిష్య త్తు కు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఐఎస్ బి వి ద్యార్థులు గొప్ప అదృష్టవంతులు ఒక్కో తరగతి గది 1.50 కోట్ల నుం చి రెండు కోట్ల వరకు వెచ్చించి ని ర్మించారు. తాను ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సింగిల్ టీచర్ ప్రభు త్వ పాఠశాలలో తెలుగు మీడియం లో చదువుకున్నానని, రాసుకునేం దుకు పలకలు కూడా లేక పోవడం తో మా గురువులు ఇసుక పైనే అక్ష రాలు దిద్దిన సందర్భాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.

గురుపూజ దినోత్సవం రోజు ఐఎస్ బి వంటి గొప్ప విద్యాలయంలో ఎ గ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభించు కో వడం అభినందనీయమన్నారు. తా ను ఈ స్థానానికి రావడానికి కృషి చే సిన గురువర్యులందరికి ఈ సం దర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలి పారు.ఇండియన్ స్కూల్ ఆఫ్ బి జినెస్ లో, ఆశయాలు మరియు ఆ త్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే మో తీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెం టర్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకు గౌరవంగా, సంతోషంగా ఉం దన్నారు. ఈ రోజు మనం కేవలం దాతృత్వాన్ని కాదు, దానిని మించే ఒక భావాన్ని సాక్షాత్కరిస్తున్నాం అ న్నారు.మోతీలాల్ ఓస్వాల్ ఫౌండే షన్ ఇచ్చిన సహకారం ఒక విరాళం మాత్రమే కాదు, అది జ్ఞానం, నా యకత్వం, మరియు మన సమిష్టి భవిష్యత్తుపై ఉంచిన విశ్వాసానికి ప్రతీక అన్నారు.

మనం తరచూ ప్రభుత్వాలు రోడ్లు కడతాయి అంటాం, కానీ దూర దృ ష్టి ఉన్న దాతృత్వం మాత్రం నేర్చు కునే ద్వారాలను నిర్మిస్తుంది. అ లాంటి ద్వారం మన ముందుకు తె రిచినందుకు మోతీలాల్ ఓస్వాల్ కు ధన్యవాదాలు తెలిపారు. ISB అనేది అలాంటి ద్వారాల ప్రభావాని కి సజీవసాక్ష్యం. వయస్సులో చిన్న దే అయినా, ఖ్యాతిలో విశిష్ట స్థా నంలో నిలిచింది.ఇది ప్రపంచ స్థా యిని, స్థానిక సందర్భాన్ని సమ న్వయం చేసిందనీ వివరించారు.

ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అనేది అ క్షరాభ్యాసం కాదు, అది నమ్మకాన్ని పదును పెట్టడం, ప్రతిసారి నేర్చు కుంటూ అమలు చేసే చక్రాన్ని ఆప కుండా ఉంచడం అన్నారు.ఇక్కడికి వచ్చే నాయకులు కేవలం సమకాలీ నంగా ఉండరు, చాలా సార్లు వారు కొత్త దిశను చూపిస్తారు అన్నారు.
గత ఒక్క సంవత్సరంలోనే ISB దాదాపు 200 ప్రోగ్రాముల ద్వారా 6,000 మందికి పైగా ప్రొఫెషనల్స్‌ ను శిక్షణ ఇవ్వడం గొప్ప విషయం అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ISB నీ ఒక వి ద్యాసంస్థ గానే కాదు, భాగస్వామి గా చూస్తుందని తెలిపారు. తెలం గాణ ప్రభుత్వ ఆరోగ్య అధికారుల కు శిక్షణ ఇవ్వడం నుండి, చేతివృ త్తులు, ఎన్నికలు లేదా మెట్రో రైలు వంటి రంగాలపై స్వతంత్ర అధ్యయ నాలు నిర్వహించడం వరకు, ISB తన పరిశోధన ద్వారా విధానాలను ఎలా మలచవచ్చో చూపిందనీ తెలి పారు. ముఖ్యంగా, సెంటర్ ఫర్ అ నలిటికల్ ఫైనాన్స్ మాతో కలిసి “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భా గస్వామ్యం అవుతోంది, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వై పు మా ప్రయాణం.విధానాన్ని హా మీగా, హామీని పురోగతిగా మార్చు కుంటూ ముందుకు సాగుతున్నాం అని డిప్యూటీ సీఎం వివరించారు.
ఇవాళ మనం విఘాతం (disru p tion) సాధారణం అయ్యిన కా లంలో జీవిస్తున్నాం, డిజిటలైజేషన్, సస్టైనబిలిటీ, సమానమైన వృద్ధి.
ఇవి ఏవీ ఒంటరిగా పరిష్కరించలేం అన్నారు.

ప్రభుత్వం విధానాన్ని, దృష్టిని ఇ స్తుం ది, పరిశ్రమ వనరులు, అలు ఇస్తుంది, విద్యాసంస్థలు జ్ఞానం, ప రిశోధన ఇస్తాయి, ఈ మూడూ క లి సినప్పుడు మాత్రమే నిజమైన పరి వర్తన సాధ్యం అవుతుందనీ డిప్యూ టీ సీఎం తెలిపారు.అందుకే ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ సెంటర్ ఒక భవనం మాత్రమే కాదు, ఇది క్లాస్‌రూమ్‌లు, బోర్డు రూమ్‌లు, ప్రభుత్వ కార్యాల యాలు కలిసే ఒక కుళాయిలా (cru cible) మారి, ఆలోచనలను పరి ష్కారాలుగా మలిచే స్థలం అవు తుందనీ విశ్వాసం వ్యక్తం చేశారు. తదుపరి దశాబ్దం భారతదేశానికి నిర్ణాయకం.తెలంగాణ ISB వంటి సంస్థలతో, యంగ్ ఇండియా వంటి కార్యక్రమాలతో మార్పులో భాగమ వడమే కాకుండా, దానికి నాయక త్వం వహించాలని సంకల్పించిం దన్నారు.

దాదాపు 2 లక్షల చదరపు అడు గు ల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ సెంటర్, లెక్చర్ హాల్స్, చర్చా స్థలా లు, మౌనంగా ఆలోచించడానికి మూలలు, ఆ ఆశయానికి ఓ నం గరంలా నిలుస్తుందన్నారు.ఈ సెం టర్‌ను ప్రారంభిస్తున్న సందర్భంలో, సహకారం అనే కొత్త యుగాన్ని కూ డా ప్రారంభిద్దాం, రాష్ట్రం, విద్యా సంస్థలు, పరిశ్రమ కలిసి భారతదేశ భవిష్యత్తును మలచే మార్గంలో ప యనిద్దామని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దా రిలో ధృఢ నిశ్చయంతో నడుస్తుంద నీ తెలిపారు.

విద్య అనేది కేవలం ప్రొఫెషనల్స్ త యారు చేయడమే కాకుండా, సమా జం కోసం, మానవత్వం కోసం నా యకులను తీర్చిదిద్దాలన్నది మా ప్ర జా ప్రభుత్వ సంకల్పం అని తెలిపా రు. ఈ సెంటర్ భవిష్యత్ తరాలకు దిక్సూచి ఇలా మారి, వారిని అగ్ర గామిత్వం, సమానత్వం, ఆవిష్కర ణల వైపు దారి చూపాలని కోరు కుంటున్నానన్నారు.స్కిల్స్ యూని వర్సిటీ ఇప్పటికే ప్రారంభమై, తొలి సంవత్సరంలోనే వందలాది విద్యా ర్థులకు శిక్షణ ఇచ్చింది.2025 నాటి కి దాని శాశ్వత కాంపస్ “ఫ్యూచర్ సిటీ”లో ఏర్పడుతుంది.అలాగే, మొదటి దశలో 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ₹11,000 కోట్లకు పైగా పెట్టుబడితో, విద్యా ర్థులను సమగ్రంగా తీర్చిదిద్దడానికి, అకాడమిక్‌ నుంచి పోటీ పరీక్షల వ రకు నిర్మితమవుతున్నాయి.మీ స హకారం—మార్గదర్శకత్వం, ని ధు లు లేదా భాగస్వామ్యం రూపంలో వాటి ప్రభావాన్ని మరింత పెంచి, ఈ రోజు మనం జరుపుకుంటున్న రా ష్ట్రనిర్మాణం (nation-building) భావనను మరింత విస్తరించగలద నీ డిప్యూటీ సీఎం ఆశాభావం వ్య క్తం చేశారు.

ఈ సెంటర్ మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది, ఎంత సీనియర్ అ యినా నేర్చుకోవడం ఆగదు. కొన్ని సార్లు, ఉత్తమ నాయ కులు అంటే ఉత్తమ విద్యార్థులే అని డిప్యూటీ సీఎం వివరించారు.ఈ సెంటర్ కే వలం MBAలు, CEOలు మాత్రమే కాకుండా భారతదేశం గర్వపడేలా సమస్యలకు పరిష్కారాలు కను గొ నే వ్యక్తులను తయారు చేయాలి అన్నారు. నేర్చుకోవడం ఎప్పటికీ ముగియదని మనకు గుర్తు చేస్తే, తాను కూడా ఐ ఎస్ బి లో విద్యా ర్థిగా అడ్మిషన్ తీసుకోవాలని భావి స్తున్నానని isb డీన్ మదన్ గమ నించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంత రం నేర్చుకోవడానికి ఇష్టపడతార ని, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలకు ISB లో ఐదు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొం దించి అమలు చేయాలని నిర్వాహ కులను డిప్యూటీ సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో మోతిలాల్ ఓస్వాల్ డీన్ మదన్ పిల్లుట్ల, ప్రభాత్ సిన్హా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృ ష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నా రు.