Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీల క ప్రకటన, మహిళాసంఘాలకే చేప పిల్లల పెంపకం బాధ్యతలు
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: మహిళ ల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో దే శంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృ షి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమ వారం ప్రజాభవన్ లో మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ము ఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను చూసేందుకు దేశం లోని అన్ని రాష్ట్రాల వారు తెలంగా ణ రాష్ట్రానికి వచ్చే పరిస్థితిని రా ష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం చే సిన వ్యాఖ్యలు ఆయన మాటల్లో నే…రాష్ట్రంలోని 46 వేల చెరువులు చే ప పిల్లల పెంపకానికి రూ. 122 కోట్లు విడుదల చేశామని తెలిపా రు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చే ప, రొయ్య పిల్లల పెంపకం బాధ్యత లను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగిస్తామని ప్రభు త్వం ఆ మేరకు కార్యాచరణ రూ పొందిస్తుందని డిప్యూటీ సీఎం తె లిపారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారితో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయించి ప్రభుత్వమే వారి నుంచి విద్యుత్ కొనుగోలు చేసి ఆదాయం సమకూర్చే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. హైదరాబాద్ మహానగ రంలో మహిళల చేత పెద్ద ఎత్తున వ్యాపారం చేయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.
ఐదు సంవత్సరాల కాలంలో రా ష్ట్రంలో కోటి మంది మహిళలను కో టీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు మ హిళా సంఘాలకు వడ్డీ లేని రుణా లు అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించి మొదటి సంవత్సరంలో అందరి అం చనాలను తలకిందులు చేస్తూ 21, 600 కోట్లు వడ్డీ లేని రుణాలు పం పిణీ చేసినట్టు తెలిపారు. హైటెక్ సి టీ పక్కన శిల్పారామం వద్ద విలువై న స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహి ళా సంఘాలకు ఇచ్చి ఆర్థికంగా వా రిని ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
అన్ని జిల్లాల్లో డ్వాక్రా బజార్లో ఏర్పా టు ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. రాష్ట్ర మహిళ లు ఆర్థికంగా నిలదొక్కుకొని ప్రపం చంతో పోటీ పడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపం లో ఇచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర జిడి పి పెరుగుదలకు దోహదపడుతుం దన్న నమ్మకoతో ఉన్నామని తెలి పారు. గత పది సంవత్సరాలు పరి పాలించిన వారు స్వయం సహాయ సంఘాల సభ్యులను గాలికి వది లేశారు ప్రజా ప్రభుత్వం రాగానే వా రిని ఆర్థికంగా నిలబెట్టేందుకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేప ట్టినట్టు తెలిపారు.
బలమైన కుటుంబ వ్యవస్థ కేవలం మహిళల ద్వారానే సాధ్యమవు తుందన్నారు.ఈ కార్యక్రమంలో క్రీ డలు పశుసంవర్ధక శాఖ మంత్రి వా కిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ చై ర్మన్ మెట్టు సాయికుమార్, సెర్ఫ్ సీ ఈఓ దివ్య తదితరులు పాల్గొన్నా రు.