–సాధ్యమైనంత త్వరగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం
–మెడికల్, సప్లమెంటరీ శాలరీ పెం డింగ్ బిల్స్ మొత్తం క్లియర్ చేశాం
–ఆర్థిక భారాన్ని వాయిదాకే గత ప్ర భుత్వం రిటైర్మెంట్ వయసుపెంచిం ది
Deputy CM Bhatti : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉద్యో గుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గాడి తప్పిన ఆర్థి క విధానాన్ని దారిలో పెడుతున్నా మని, సాధ్యమైనది త్వరగా ఉద్యో గుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తా మని డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క మల్లు అన్నారు. శుక్రవారం ఉద యం శాసన పరిషత్తులో సభ్యులు ఏవీఎన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సవివరం గా సమాధానం ఇచ్చారు. ఈ సం ద ర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడు తూ ప్రభుత్వ ఉద్యోగులు వివిధ అ వసరాల కోసం తీసుకున్న ఈ EMI ల కు ప్రతినెలా మొదటి తేదీన చె ల్లించకపోతే బ్యాంకులు వారి ఖాతా లు డిఫాల్ట్ జాబితాలో చేరుస్తాయ ని, గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యో గులకు 18 వ తారీఖున కూడా జీ తాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. దాం తో వారు అనేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని మా ప్రభుత్వం వ చ్చాక ఆలోచన చేసి ఉద్యోగ సం ఘాలతో చర్చలు జరిపామని గుర్తు చేశారు.
ఉద్యోగులు మాలో భాగస్వాములు గా భావించి మేము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినెలా ఒక టవ తేదీన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల జీతాలు చెల్లిస్తు న్నామన్నారు. ఆర్థిక భారాన్ని వా యిదా వేసేందుకు ఉద్యోగుల ప్ర యోజనాలు చెల్లించకుండా రిటై ర్మెంట్ వయోపరిమితిని మూడు సంవత్సరాలకు గత ప్రభుత్వం పెం చిందని డిప్యూటీ సీఎం అన్నారు. ఆనాటి ప్రభుత్వం ఉద్యోగుల రిటై ర్మెంట్ వయోపరిమితి పెంచకపోయి ఉంటే వాస్తవంగా 2021 నుంచి 20 23 మధ్య సంవత్సరాల్లో 26,854 మంది పదవి విరమణ పొందాలి కా నీ ఓయోపరిమితి పెంపుతో కేవలం 6,354 మంది మాత్రమే రిటైర్ అ య్యారని ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం అన్నారు. ఆనాడు వాస్తవాలు తెలియక కొంతమంది పాలాభిషేకా లు చేశారని అన్నారు.
2023 డిసెంబర్ నాటికి గత ప్రభు త్వం మాకు వివిధ రకాల బకాయి ల కింద 43,154 కోట్లు బిల్స్ పెం డింగ్ లో పెట్టి వెళ్లిపోయిందని తె లి పారు. ఇందులో కేవలం ఉద్యోగుల బకాయిలే 4,575 కోట్లు ఉన్నాయి ఈ విషయాన్ని ఆర్థిక శ్వేత పత్రంలో సైతం వివరించామని డిప్యూటీ సీ ఎం తెలిపారు. మా ప్రభుత్వం వ చ్చాక పెన్షన్ బెనిఫిట్స్ 1,752 కోట్ల రూపాయలు చెల్లించామని, ఉద్యో గుల పెండింగ్ బిల్లులు 6,244 కో ట్లు ఉన్నాయని, ప్రాధాన్యత క్రమం లో ప్రతినెల ఇబ్బంది లేకుండా చెల్లి స్తూ వెళ్తున్నామని తెలిపారు.
ప్రతినెల అదనంగా ఉద్యోగుల బ కాయిలను క్లియర్ చేసేందుకు 700 కోట్లకు తక్కువ కాకుండా విడుదల చేస్తున్నామని వివరించారు. గత ప్ర భుత్వం కనీసం ఒకటవ తేదీన జీ తాలు చెల్లించకపోవడంతో ఉద్యో గులు సకాలంలో చెల్లింపులు చేయ లేక విష వలయంలో చిక్కుకొనిపో యారని మేము రాగానే వారితో మాట్లాడి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలని విధానపరమైన నిర్ణ యం తీసుకొని ఒక్కరోజు కూడా ఆ లస్యం లేకుండా చెల్లిస్తున్నామన్నా రు. మెడికల్ బిల్లులు పెండింగ్ లో పెట్టడం అమానవీయ అంశంగామా ప్రభుత్వం భావించి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న 200 కోట్ల పైన మెడి కల్ బిల్లులు మొత్తాన్ని క్లియర్ చే శాం, ఇకనుంచి ఏ నెలకు ఆ నెల మెడికల్ బిల్లులు క్లియర్ చేస్తామని తెలిపారు. ఇక సప్లిమెంటరీ శాలరీ ల విషయానికొస్తే రూ. 560 కోట్లు బకాయిలు మొత్తం క్లియర్ చేశాం ఇకనుంచి సప్లమెంటరీ శాలరీ బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని డివిడి సీఎం తెలిపారు.
ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆ రోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొ ని వారికి కావాల్సిన హెల్త్ స్కీము ను వారే డిజైన్ చేసుకొని రావాలని చెప్పాం, ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ప్ర తి నెలా టెన్షన్ గా మొదటి తేదీన జీతాలు చెల్లించడం కూడా గొప్ప వి షయమే అని డిప్యూటీ సీఎం తెలి పారు. మొదటి తేదీ నా జీతాలు ఇ వ్వక పోతే ఉద్యోగులు ప్రైవేటు వ్య క్తుల దగ్గర అధిక వడ్డీల కోసం వెళ్లా ల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపా రు.