–దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
Devarakadra MLA Madhusudhan Reddy : ప్రజా దీవెన, దేవరకద్ర: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య ను అందించడం తో పాటు ప్రతి పా ఠశాలకు మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్ రెడ్డి అన్నా రు. వరి ధాన్యం కొనుగోళ్లు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా బుధ వారం దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి గ్రామానికి విచ్చేసిన దేవరకద్ర శాసన సభ్యులు ఎమ్మెల్యే గవినోళ్ల మధు మధుసూదన్ రెడ్డిని పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు లయన్ అశ్విని చంద్ర శేఖర్, ప్రాథమిక పాఠశాల హెచ్ యం ఎస్.కల్పన లు మర్యాద పూ ర్వకంగా కలిసి ప్రాథమిక పాఠశా లలో చదువుతున్న 90 మంది విద్యార్థుల సౌకర్యార్థం కూర్చోవ డానికి డ్యుయల్ డెస్క్ బెంచీలు మంజూరు చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు.
ఈ విషయంగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని కృషి చేస్తుం దని అన్నారు. తమ ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పా టు చేసి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు మౌళిక వసతులు కల్పించ మన్నా రు. తరగతి గదుల మరమ్మతులు, విద్యుదీకరణ, మంచి నీరు, మరు గుదొడ్లు, ఉచిత విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించడం జరిగిం దని అన్నారు. రకరకాల పెయిం టింగ్ లతో పాఠశాలల రూపు రేఖ లు మారుస్తూ ఆకర్షణీయంగా తీ ర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా విద్యా రంగ అభివృద్ధికి సి యం రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రాధా న్యత , ప్రోత్సాహంతో ప్రభుత్వ పా ఠశాలలు నాణ్యమైన విద్యకు నిల యాలుగా మారాయని అన్నారు. లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల వి ద్యార్థుల సౌకర్యార్థం డ్యుయల్ డెస్క్ బెంచీలు ఏర్పాటు చేయిస్తాన ని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం ఎస్.కల్పన, ఉన్నత పాఠశాల ఇంచార్జ్ హెచ్ యం అస్రఖాద్రి , ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్, విజయ లక్ష్మీ, నాగేశ్వర్ రెడ్డి, మురళీధర్, శంకర్, మదన్ మోహన్, సుజాత,కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.