— దేవరకొండ శాసనసభ్యు లు బాలు నాయక్
Devarakonda MLA Balu Nayak : ప్రజా దీవెన, దేవరకొండ: ఆడపి ల్లలు ఇంటికి మహాలక్ష్మిలని, ఆడ పిల్లల పట్ల వివక్షత చూపిం చవద్ద ని దేవరకొండ శాసనసభ్యులు బా లు నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేవర కొండలో పోష ణ పక్షోత్సవాలలో భాగంగా “పోష ణ జాతర” అమ్మ పోషణ- బిడ్డ లా లన అన్న అంశం పై ఏర్పాటు చేసి న ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
50,60 సంవత్సరాలకు పూర్వం ఆ స్పత్రులు అంతగా లేని సమయం లో 90% పైగా సాధారణ ప్రసవాలు అయ్యేవని, ఆ కాలంలో బాగా కష్ట పడి పనిచేసేవారని, ప్రస్తుతం ఎ లాంటి శారీరక శ్రమ లేకపోవడం, సాంకేతికత పెరిగినందున అంద రూ సిజేరియన్ ప్రసవాల వైపు వెళుతున్నారని అన్నారు.
గర్భిణీ స్త్రీలు ఎట్టి పరి స్థితులలో సిజేరియన్ ప్రసవాలకు వెళ్లకుండా, సాధారణ ప్రసవం చేయించుకోవా లని, డాక్టర్లు సైతం తల్లి ,బిడ్డ ప్రా ణాలకు ఇబ్బంది ఉన్నప్పుడు మా త్రమే సిజేరియన్ చేయాలని, లేదం టే సాధారణ ప్రసవాలు చేయాలని కోరారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని,ఇందుకు పౌష్టికా హారాన్ని తీసుకొవాలని, వారు బ లంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమై న బిడ్డలు పుడతారని తెలిపారు.
ముఖ్యంగా నువ్వులు, బెల్లం,పల్లి, మిల్లెట్స్ ఆహారం తీసుకోవడం, ఆ కుకూరలు, కూరగాయలు, గుడ్లు, పాలు తినాలని చెప్పారు. అలాగే కాలానికి అనుగుణంగా లభించే పండ్లు తినాలని , తల్లిపాలు సర్వ రోగ నివారిని అని తల్లి పాలకు మించింది లేదని, ప్రతి గర్భిణీ స్త్రీ దీన్ని దృష్టిలో ఉంచుకొని తప్పని సరిగా బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని చెప్పారు. ఆరోగ్యంగా ఉండి ఆరో గ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వ లని, రెగ్యులర్గా డాక్టర్ తో పరీక్షలు చేయించుకోవాలని, ఐరన్ టాబ్లెట్స్ వాడాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రా ల ద్వారా బాలింతలు, మహిళల కు, చిన్న పిల్లలకి ఇస్తున్నదని వా టిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రస్తుతం సమాజంలో ఆడ పిల్లలకు ఉన్న అవకాశాలు ఎవరికి లేవని, ఆడపిల్లలు ఇంటికి మహా లక్ష్మిలని, ఆడవారికి ప్రస్తుతం అంగన్వాడీల తో పాటు ,పాఠశాలలు, రెసిడె న్షి యల్ పాఠశాలలు ఉన్నాయని, వీరందరికీ సన్న బియ్యంతో భోజ నం అందిస్తున్నామని చెప్పారు.
దేవరకొండ నియోజకవర్గానికి మరో 5 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తు న్నట్లు ఆయన వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మాట్లా డుతూ భావితరాలను ప్రపంచానికి తీసుకువచ్చే గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అ న్నారు. డాక్టర్ల సలహాలను, సూచ నలు పాటించాలని, పుట్టే బిడ్డ పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, పోషకాహారంపై దృష్టి పెట్టాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవద్దని, ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడ, మగ ఇద్దరూ సమానమని, ఆడపిల్లల పట్ల వివక్షత చూపించవద్దని, కడుపులో ఉన్న బిడ్డను బ్రతకనీయాలని పిలుపునిచ్చారు. దేవరకొండ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలు, మహిళల రక్తహీనతను దృష్టిలో ఉంచుకొని వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకుగాను పౌష్టికాహారం పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ శాలిని, డాక్టర్ విజ య, తదితరులు మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి సమావేశానికి అధ్యక్షత వహిం చారు.
జిల్లా పంచాయతీ అధికారి వెంక య్య, ఏపీ డి శారద, హైదరా బాద్ స్వచ్ఛంద సంస్థ నుండి వచ్చిన డా క్టర్ రష్మీ, ఆర్డిఓ రమణారెడ్డి, త హసిల్దార్ ,ఎంపీడీవో, వైద్య ఆరో గ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ , గ్రామీనాభివృద్ధి శాఖల నుండి అధికారులు తదిత రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు జిల్లా కలెక్టర్లు గర్భిణీ స్త్రీలు బాలిం తలకు పోషణ కిట్లను అందజేశా రు. గర్భిణీ స్త్రీలు , బాలింతలు, కౌ మర బాలికలను ఉద్దేశించి ఏర్పా టుచేసిన స్టాల్స్, మిల్లెట్స్ వంటకా లు అందరినీ ఆకట్టుకున్నాయి.