—మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్
Boora Narsaiah Goud : ప్రజా దీవెన, చౌటుప్పల్:కేంద్రం ఎం త కృషి చేసినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో అభివృద్ధి అ డ్డంకులు ఎదుర్కొంటుoదని నర్స య్యగౌడ్ విమర్శించారు.నల్గొండ జిల్లా చౌటుప్పల్ పట్టణంలో భారతీ య జనతా పార్టీ కొత్త కార్యాలయా న్ని మాజీ పార్లమెంట్ సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్ ముఖ్య అతి థిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బూరనర్సయ్య గౌ డ్ మాట్లాడుతూ మునుగోడు ప్రజ లు ఎదుర్కొంటున్న త్రాగునీటి కొ ర త సాగునీటి సమస్యలు ఉపాధిలో పం, రోడ్ల దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని వి మర్శించారు. కాంగ్రెస్ నేతల అస త్య ప్రచారాలను తప్పు పడుతూ ప్రజలు ఇక మోసపోవరని కాంగ్రెస్ పార్టీనీ గట్టిగా హెచ్చరించారు. మో దీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ స్థాయిలో గౌరవనీయ స్థానాన్ని సం పాదించిందని గుర్తు చేశారు. అభి వృద్ధి మార్గంలో దేశం ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యాలయం గ్రామస్థాయి నుం డి బీజేపీ బలోపేతానికి కేంద్రంగా మారనుందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నా రు.