Dharma Rao : దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం అత్యంత పవిత్రమైనది, సర్వోన్నతమైనది.ధర్మారావు మాజీ ఎమ్మెల్యే.
Dharma Rao : ప్రజా దీవెన, నల్గొండ: బీజేపీ జిల్లా కార్యాలయం లో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యాశాల కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు డా నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యాశాలకు ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు విచ్చేశారు..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 26 నవంబర్ 2015న తొలిసారి రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించిందని. అప్పటి నుండి ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ మనం రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్నాం. దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం అత్యంత పవిత్రమైనది, సర్వోన్నతమైనది. గత నెలలో భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవంపై పార్లమెంట్ ఉభయ సభల్లో సమగ్ర చర్చ జరిగింది. ప్రధాని మోడీ నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవార్ధం పంచతీర్థాల అభివృద్ధితో పాటు పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాల ద్వారా అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి అని అన్నారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “రాజ్యాంగం వర్తమానానికి మరియు భవిష్యత్తుకు మార్గదర్శి. నేడు ప్రతి పౌరుడి ఏకైక లక్ష్యం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడమే” అని అన్నారు.
*బీజేపీ జిల్లా అధ్యక్షులు డా”నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ *
రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పార్లమెంటులో చేసిన ప్రసంగం మనందరికీ స్ఫూర్తిదాయకం, ప్రతి కార్యకర్త ఈ విషయాన్ని సామాన్య ప్రజలకు చేరవేయాలి. బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఆదేశాల మేరకు జనవరి 11 నుండి జనవరి 25 వరకు “సంవిధాన్ గౌరవ్ అభియాన్” దేశవ్యాప్తంగా నిర్వహించాలి అని తెలిపారు. .అందులో భాగంగానే నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జనవరి 19, 20 తేదీలలో జిల్లా వారిగా సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమాలు జరుపుకుంటూ
జనవరి 26న ప్రతి బూతలలో గణతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం మరియు భారత రాజ్యాంగంలోని ప్రవేశిక మరియు ఆదేశిక సూత్రాలను చదివి ప్రజలకు వినిపిస్థమని అన్నారు ఈ కార్యశాలలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్.వీరెల్లి చంద్రశేఖర్,నూకల నరసింహ రెడ్డి,బండారు ప్రసాద్,సాధినేని శ్రీనివాస్,లాలు నాయక్,పిల్లి రామరాజు,నకిరేకంటి మొగిలయ్య, చేనమోని రాములు,
రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, అన్ని మోర్చాల అధ్యక్షులు, జిల్లా అభియాన్ కమిటీ మండల అభియాన్ కమిటీ ,మండల అధ్యక్షులు, పూర్వ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నా రు. .