Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dhavaleswaram Dam: ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

–రెండో ప్రమాద హెచ్చరిక జారీ
–జలదిగ్భందంలో పలు గ్రామాలు

Dhavaleswaram Dam:ప్రజా దీవెన, అమరావతి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari District) గోదావరి నీటి మట్టం గంటగంటకు పెరుగు తోoది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ (Dhawaleswaram Cotton Barrage) వద్ద ప్రస్తుతానికి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోoది. సోమ వారం అర్ధ రాత్రి 2గంటల సమ యంలో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. కాటన్ బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి దిగువ ప్రాం తానికి అధికారులు నీటిని వదులు తున్నారు. సుమారు 13లక్ష ల14వే లు క్యూసెక్కుల నీటిని దిగుప్రాంతా నికి వదులుతున్నారు. మంగళవా రం ఉదయం ఏడు గంటల వరకు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14 అడుగులకు నీటి మట్టం చేరింది. ఏజెన్సీలో గంటగం టకు వరద ప్రభావం పెరగ డంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు (officers) అప్రమత్తం చేశారు.

చింతూరు జాతీయ రహదారి (Chintoor National Highway)(NH)30పై వరద నీరు చేరింది. చింతూరు నుండి భద్రాచలం వెళ్లే రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్ప డింది. వి.ఆర్.పురం మండలం చింతరేవుపల్లి, తుష్టివారి గూడెం గ్రామాల వద్ద వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద బ్రిడ్జిని ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుంది. నాలుగు మండలాల్లో సుమారుగా 250 గ్రామాలకు రాకపోక లకు పూర్తిగా నిలిచిపో యాయి. లోతట్టు గ్రామాల ప్రజలను అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ (AS Dinesh Kumar)అప్రమత్తం చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిం చడానికి 18 లాంచీలను అధి కారులు ఏర్పాటు చేశారు.