Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Digital Condom: డిజిటల్ కండోమ్

–యాప్‌ రూపొందించిన జర్మనీ సంస్థ
–శృంగార సమయంలో రహస్య రికార్డింగ్‌లకు చెక్‌
–బ్లూ టూత్‌తో కెమెరా, మైక్రో ఫోన్‌లకు అడ్డుకట్ట
–కామ్‌డొమ్‌గా పేరు, 30 పైగా దేశాల్లో విడుదల

Digital Condom: ప్రజా దీవెన, బెర్లిన్‌: వ్యక్తుల శరీరంలో ఓ భాగమై వ్యక్తిగత జీవితంలోకి సెల్‌ ఫోన్‌ (Cell phone) చొచ్చు కెళ్లిందన్న విషయం తెలిసిందే. పైగా సైబర్‌ నేరాలు (Cyber ​​crimes) విపరీతంగా పెరిగిన కాలం ఇఇక కొందరు,సన్నిహిత సంద ర్భాలను స్మార్ట్‌ ఫోన్లలో రహ స్యంగా రికార్డు చేస్తూ ఆ తర్వాత వాటిని చూపి బెదిరింపులకు పాల్ప డుతున్నారు. ఇలాంటివాటికి అవ కాశం లేకుండా జర్మనీకి చెందిన లైం గిక ఆరోగ్య సంస్థ బిల్లీ బాయ్‌ ఓ యాప్‌ను తీసుకొచ్చింది.

దీని పేరు కామ్‌డొమ్‌ (Comdom). రహస్య రికార్డింగ్‌లకు చెక్‌ పెట్టేలా రూపొందించిన ఈ యాప్‌ను, సన్నిహిత సందర్భాల్లో, శృంగారంలో పాల్గొనేముందు మొబైల్‌ ఫోన్లను ఒకదగ్గరకు చేర్చి యాక్టివేట్‌ చేయాల్సి ఉంటుంది. వర్చువల్‌ బటన్‌ స్వైప్‌ చేస్తే, బ్లూ టూత్‌ ద్వారా కెమెరా, మైక్రోఫోన్‌ లు రికార్డు చేయకుండా చూస్తుంది. ఏదైనా ఫోన్‌ను అన్‌ బ్లాక్‌ (Unblock) చేసేందు కు ప్రయత్నిస్తే అలర్ట్‌ సైరన్‌ మోగు తుంది. ఈ యాప్‌ ద్వారా పలు డివైజ్‌లను ఒకేసారి నియంత్రిచడం సాధ్యమని బిల్లీ బాయ్‌ (Billy Boy) తెలిపింది. కాగా, కామ్‌డొమ్‌ను డిజిటల్‌ కండో మ్‌గా వ్యవహరిస్తున్నారు. నిజమై న కండోమ్‌లను వినియోగించి నంత సులభం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బిల్లీ బాయ్‌ దీనిని 30 పైగా దేశాల్లో విడుదల చేసింది.