Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Kalvakuntla Kavitha : ఆడబిడ్డలను ఆగౌరవించడమంటే ఇలాంటి వ్యాఖ్యలే నిదర్శనం

–తీన్మార్ మల్లన్నపై శాసనమండలి చైర్మన్, డీజీపీకి ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత ఫిర్యాదు

MLC Kalvakuntla Kavitha : ప్రజా దీవెన, హైదరాబాద్ : ఆడబి డ్డలను ఎంతగానో గౌరవించే తెలం గాణలో చట్టసభలో సభ్యుడిగా ఉ న్న వ్యక్తి హేయమైన వ్యాఖ్యలు చే యడం దారుణమని ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశా రు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై చర్య లు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞ ప్తి చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని చైర్మన్ నివాసంలో గుత్తా సు ఖేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు లేఖ తో పాటు తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలతో కూడిన పెన్ డ్రైవ్ అందజేశారు. చైర్మన్ కు ఉన్న విచక్షణ అధికారాలను ఉప యోగించి తీన్మార్ మల్లన్న సభ్య త్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న తనపై చే సిన వ్యాఖ్యలను శాసన మండలి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కో రారు.

తెలంగాణ ఉద్యమంలోనూ కాల్పు లు జరపలే తెలంగాణ ఉద్యమం ఉ వ్వెత్తున సాగుతోన్న రోజుల్లోనూ పోలీసులు, నాయకుల గన్ మెన్లు ఏ ఒక్క రోజు కాల్పులు జరిపిన దా ఖలాలు లేవని ఎమ్మెల్సీ కవిత అ న్నారు. ఆదివారం మండలి చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేసిన అనంత రం ఆయన నివాసం ఎదుట మీడి యాతో మాట్లాడారు.

తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యా ఖ్యలపై నిరసన తెలిపేందుకు జాగృ తి కార్యకర్తలు ఆయన కార్యాల యానికి వెళ్లారని తెలిపారు. వాళ్లు దాడి చేస్తేనే తమ వాళ్లు ప్రతిదాడి చేశారని ఇం తమాత్రానికే గన్ ఫైర్ చేస్తారా అని ప్రశ్నించారు. ఒక ఆడ బిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నా రా అని నిలదీశారు. తాను ఎట్టి ప రిస్థితుల్లోనూ ఊరుకోబోనని తేల్చి చెప్పారు. తాను మామూలు ఆడబి డ్డను కాదు, అగ్గిరవ్వను అని హె చ్చరించారు.సీఎం రేవంత్ రెడ్డి కు టుంబ సభ్యులను సోషల్ మీడి యాలో పోస్ట్ పెట్టారని ఇద్దరు మ హిళా జర్నలిస్టులను అరెస్టు చేశా రని తనపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్య లు చేసినా సీఎం ఎందుకు స్పందిం చలేదని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులపై ఒకతీరు, తెలంగాణ ఆ డబిడ్డనైన తన వ్యక్తిత్త హననానికి పాల్పడ్డ వారిపై మరోలా వ్యవహరి స్తారా అని నిలదీశారు. తీన్మార్ మ ల్లన్నపై సీఎం చర్యలు తీసుకోకపో తే ఈ వ్యాఖ్యలు వెనుక ఆయన ఉ న్నారని భావించాల్సి వస్తుందన్నా రు.

జాగృతి కార్యకర్తలపై కాల్పుల ఘట నను సీరియస్ గా తీసుకోవాలన్నా రు. సీఎం, డీజీపీ వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాల న్నారు. ఎమ్మెల్సీనైనా తనపై చేసిన వ్యాఖ్యలనే పట్టించుకోకపోతే సా ధారణ మహిళల పరిస్థితి ఏమిట న్నారు. తాను ఏడాదిన్నరగా బీసీల కోసం ఉద్యమిస్తున్నానని.. ఏ ఒక్క రోజు కూడా తాను తీన్మార్ మల్లన్న ను ఒక్కమాట కూడా అనలేదన్నా రు. అలాంటప్పుడు తనపై అనుచి త వ్యాఖ్యలు చేయాల్సిన అవస రం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాల్లోకి రావా లంటేనే మహిళలు భయపడే పరి స్థితి ఇలాంటి ఘటనలతో ఉత్పన్న మవుతుందన్నారు. తీన్మార్ మల్ల న్న బీసీ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందని అను కోవడం సరికాదన్నారు.

కాల్పుల ఘటన వెనుక ప్రభు త్వమే ఉంది… తెలంగాణ జాగృ తి కార్యకర్తల ఘటన వెనుక ప్రభు త్వ హస్తం ఉందని ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి కార్యకర్తలపై కాల్పులు, దాడి, తన వ్యక్తిత్తాన్ని హననం చేసేలా వ్యా ఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చ ర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీ పీ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. ఆది వారం లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఐజీ రమణ కుమార్ ను కలిసి ఫి ర్యాదు అందజేశారు. అనంతరం ఎ మ్మెల్సీ కవిత మీడియాతో మాట్లా డుతూ, తనపై అనుచిత వ్యాఖ్య లు చేసిన తీన్మార్ మల్లన్నపై కంప్లైం ట్ చెయ్యడానికి డీజీపీ ఆఫీసుకు వ చ్చాన్నారు. జాగృతి కార్యకర్తలపై తొపాకులతో కాల్పులు జరిపించిం ది తీన్మార్ మల్లన్న నా, లేక ప్రభు త్వమా అనేది తెలియాలన్నారు.

సమగ్ర విచారణ చేయాలని డి మాండ్ చేస్తున్నానని తెలిపారు. ఇంత పెద్ద ఘటనపై ఫిర్యాదు చే యడానికి వస్తే డీజీపీ ఆఫీస్ కు రా లేదు అంటే దీని వెనుక ప్రభుత్వమే ఉందన్న అ నుమానం కలుగుతుం దన్నారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల తోనే గన్ మెన్ కాల్పులు జరిపా రని, గన్ మెన్లను వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.