–శ్రీనగర్ కాలనీలో లోవోల్టేజి సమస్య పరిష్కారానికై 11 కెవి లైన్ వేయాలి
–జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో కొండూరు విన్నపం
District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ పట్టణంలోని పానగల్లు రోడ్డులోని శ్రీనగర్ కాలనీలో బురదమయంగా ఉన్న ప్రధానమైన రోడ్లను సిమెంట్ రోడ్లుగా నిర్మాణం చేయాలని నల్లగొండ మున్సిపల్ మాజీ కౌన్సిలర్, కో ఆప్షన్ సభ్యులపారం రాష్ట్ర అధ్యక్షులు కొండూరు సత్యనారాయణ జిల్లా కలెక్టర్ ను కోరారు. బురదమయంగా ఉన్న కాలనీ లలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని, శ్రీనగర్ కాలనీలో లోవోల్టేజి సమస్య పరిష్కారానికై 11 కెవి లైన్ వేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు కలెక్టర్ కు విన్నవించిన ఫలితంగా పట్టణంలోని 19వవార్డులో ఇప్పటికే కొన్ని సిసి రోడ్లనిర్మాణం జరిగాయని కానీ, బురద మయం గా ఉన్నటు ప్రధానమైన రోడ్ల ను సిమెంట్ రోడ్లుగా వెంటనే నిర్మాణం చేయించాలని కోరారు. శ్రీనగర్ కాలనీ పైభాగంలో ఉన్న ప్రధాన మంచి నీటి సమస్య పరిష్కారా నికి పైపు లైన్ వేయించాలని ఆయన కోరారు. అలాగే 19వ వార్డు ప్రజావసరాల రీత్యా కౌన్సిల్ లో, గత కమీషనర్ మంజూరు చేసిన పనులను చేపట్టకుండా, మున్సిపల్ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ప్రస్తుత నల్లగొండ మున్సిపల్ కమీషనర్ పై అధికారుల ఆదేశాలు భేఖాతరు చేస్తున్నారని, ఇప్పటికైనా అట్టి పనులను వెంటనే చేయించాలని కలెక్టర్ ను కోరారు.
శ్రీనగర్ కాలనీ, దీపక్ నగర్, ఎన్జీవోస్ కాలనీ, ఆదిత్య కాలనీలలో ఏ చిన్న గాలి వచ్చినా, వాన వచ్చినా పానగల్లు విద్యుత్ ఫీడర్, శ్రీనగర్ కాలనీ విద్యుత్ ఫీడర్ కలిసి ఉండడం వలన అదనపు లోడ్ తో ట్రిప్ అయి ప్రతిసారి కరెంట్ పోయి, ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కరం గా ఉన్నది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.
వీటితో పాటు శ్రీ నగర్ కాలనీలో, అమూల్య కాలనీలో, ఆదిత్య కాలనీలో శిథిలమైన కరెంట్ పోల్లను వెంటనే మార్పు చేయాలని, సుమారుగాగా 25 పోల్ల వరకు త్రీ ఫేస్ లైన్ లాగించాలని అదనంగా 20 పోల్ల వరకు కొత్త లైన్ ఏర్పాటు చేయాలని కోరారు.నందీశ్వర కాలనీ, శ్రీనగర్ కాలనీలలో ప్రమాధ కరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను షిఫ్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో 19వ వార్డు కాలనీవాసులు ఎం. కిషన్, ఎం. దశరథ, యాకాల వెంకన్న, నిమ్మనగోటి శ్రీను, జంపాల గిరి, కొండూరు గిరి, కవిత, క్రిష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.