Collector Ila Tripathi : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీల్, వర్షాల నేపధ్యంలో అన్నదాతలు, అధికారులు అప్రమత్తమవ్వాలి
Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రానున్న రెం డు రోజులు వర్షాలు కురిసే అవకా శం ఉందన్న వాతావరణ శాఖ హె చ్చరికల నేపథ్యంలో ధాన్యం కొను గోలు కేంద్రాలలో ధాన్యం తడవకుం డా కొనుగోలు కేంద్రాల నిర్వాహ కు లు, రైతులు అప్రమత్తంగా ఉండాల ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరా రు. ధాన్యం సేకరణపై శుక్రవారం ఆ మె రెవెన్యూ, పౌరసఫరాలు, వ్య వ సాయ, సంబంధిత శాఖల అధికా రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. వర్షాలను దృష్టిలో ఉంచు కొ ని ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించి సరైన నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు.
ధాన్యం కొనుగోలులో పూర్తిగా నిబం ధనలను పాటించాలని, సరైన తే మశాతం నాణ్యత ప్రమాణాలతో ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగో లు చేసి మిల్లులకు పంపించాల న్నారు. వర్షాలు,కొనుగోలు కేంద్రా ల లో స్థలాభావాన్ని దృష్టిలో ఉంచు కొని కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధా న్యాన్ని రెగ్యులేట్ చేయాలన్నారు.
ధాన్యం తడవకుండా తీసుకో వా ల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచన చేయాలన్నారు .ప్రత్యకించి ఈ రెం డు, మూడు రోజులు రైతులు వరి కోతలు లేకుండా అవగాహన కల్పిం చాలని, కోసిన తర్వాత ధాన్యం సు లభంగా తడిసిపోయెందుకు అవ కాశం ఉందని, అలా కాకుండ పంట మీద ఉన్నప్పుడు ఎలాంటి నష్టం క లగదని, ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు.ఈ అం శంపై డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు సమావేశం ఏర్పాటు చేసి హార్వెస్ట ర్లు, రైతులకు అవగాహన కల్పించా లన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఉ న్న ధాన్యం వర్షం వస్తే తడవకుండా టార్పాలిన్లను సిద్ధం చేసుకోవాల న్నారు.
అదే విధంగా అలాగే వర్షం లేన ప్పు డు ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, తూర్పార పెట్టడం వంటి వాటిని చేసేందుకు టార్పాలిన్ల తోపాటు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అన్ని కొను గోలు కేంద్రాలలో లారీలు సైతం సి ద్ధంగా ఉండాలని,కొన్న ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు చర్యలు చేపట్టాలని ,ప్రతిరోజు ధాన్యం తేమ శాతాన్ని ,కొనుగోలు కేంద్రాలకు వ చ్చే దాన్యం వివరాలన్నింటినీ రికా ర్డులు నిర్వహించాలని చెప్పారు. ఆయా కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ట్యాగింగ్ చేయ డా న్ని పూర్తిచేయాలని, హడావుడిగా ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లు లకు పంపించే క్రమంలో చెత్త, చెదా రం వంటివి సంచులలో నింపవద్ద ని, అలాచేస్తే సెంటర్ నిర్వాహకుల తో పాటు, సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎట్టి పరిస్థితులలో నాణ్యత లేని ధాన్యం మిల్లులకు వెళ్ళకూడదన్నా రు. తహసిల్దారులు వారి పరిధిలో ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పా రు.కొనుగోలు చేసిన ధాన్యానికి రై తులకు వెంటనే చెల్లింపులు చేయా లని, ఇందుకుగాను ఓబి ఎంఎస్ వి ధానాన్ని వేగవంతం చేయాలని చె ప్పారు. రైస్ మిల్లర్లు ఇంకా ఎవరైనా బ్యాంక్ గ్యారంటీ సమర్పించనట్ల యితే తక్షణమే సమర్పించే విధంగా మిల్లర్లతో మాట్లాడి పూర్తి చేయాల ని రెవెన్యూ అదనపు కలెక్టర్ కు సూచించారు.
ఇంకా ఎక్కడైనా కొనుగోలు కేంద్రా లు ప్రారంభించనట్లయితే తక్షణం ప్రారంభించాలని, అక్కడ అవసర మైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. రెవెన్యూ అ దనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ధాన్యం సేకరణ పై కొనుగోలు కేంద్రాల నిర్వ హకులు, రైతులకు పలు సూచన లు చేశారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా వ్య వసాయ అధికారి శ్రవణ్, తదితరు లు మాట్లాడారు.
_