అవగాహన లోపంతో ధాన్యం వెం టనే మార్కెట్ కు తరలించాలనే ఆ త్రుతతో రైతులు పంట కొత త ర్వా త ధాన్యాన్ని నేరుగా ధాన్యం కొను గోలు కేంద్రాలకు తరలించడం వల్ల తేమశాతం ఎక్కువగా ఉండడం వల్ల ధాన్యం కొనుగోలులో రైతుల కు ఇబ్బందులు ఏర్పడుతున్న వి షయం తెలిసిందే. దీని వల్ల ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి ఉంచి ఆర బెట్టాల్సిరావ డం, ఈ సమయంలో వర్షం కురిస్తే తిరిగి ధాన్యం తడవడం, ఇటు రై తులు, అటు కొనుగోలు కేంద్రం ని ర్వాహకులు, ప్రభుత్వం అనేక స మస్యలను ఎదుర్కొంటున్న విష యాన్ని మనం చూస్తున్న విషయ మే.
ఈ సమస్యలన్నింటిని అధిగ మిం చేందుకు రైతులు తెచ్చిన ధా న్యా న్ని ఆరబెట్టేందుకు ప్రభుత్వం ప్ర యోగాత్మకంగా అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిం చిన దాన్యం ఆరబెట్టే కొత్త యంత్రా లను కొనుగోలు చేస్తున్నది. ఇందు లో భాగంగా నల్గొండ జిల్లా యం త్రాంగం 2 మొబైల్ గ్రైన్ డ్ర యర్లను ఒక్కోటి 14 లక్షల 40 వేల రూపా యల వ్యయంతో కొనుగోలు చేయ డం జరిగింది.తాత్కాలికంగా వీటిని ఒకటి తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మరొకటి మి ర్యాలగూడ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసేం దుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా తిప్పర్తి మార్కె ట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన సం చార గ్రైన్ డ్రయర్ యంత్రాన్ని శు క్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ఈ సందర్భంగా ధా న్యం తేమను ఆరబెట్టే యంత్రం పనితీరు, ప్రయోజనాలు , ఇబ్బం దులు అన్ని విషయాలను అధికా రుల ద్వారా అడిగి తెలుసుకున్నా రు. వెంటనే యంత్రం సరఫరా చేసి న ప్రతినిధులను పిలిపించి యం త్రం పని తీరును పరిశీలించి వచ్చే సీజన్ లో రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని జి ల్లా కలెక్టర్ ఆదేశించారు.
మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగో లు చేసిన ఈ ధాన్యం తేమ ఆర బె ట్టే యంత్రం తేమశాతం ఎక్కువగా ఉన్న సమయంలో 17 శాతానికి త గ్గించే అవకాశం ఉంది.రెవెన్యూ అ దనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధి కారి ఛాయాదేవి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంక టేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల మేనే జర్ హరీష్ , మార్కెటింగ్ సెక్రెటరీ శ్రీధర రాజు, తిప్పర్తి తహసి ల్దార్, ఎంపీడీవో, తదితరులు జిల్లా కలె క్టర్ వెంట ఉన్నారు.