District Collector Tripathi : జిల్లా కలెక్టర్ ఆదేశం, జిల్లా పరిధి లోని రైతులకే మాత్రమే ఎరువులు అమ్మాలి
District Collector Tripathi : ప్రజా దీవెన, డిండి: ఎరువుల కొర త లేకుండా ఏరుల దుకాణం దారు లు జిల్లా రైతులకు మాత్రమే ఎరు వులను అమ్మాలని జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి ఆదేశించారు.శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా, గుండ్లపల్లి (డిండి) మండల కేంద్రంలోని ఆగ్రో రై తు సేవ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చే సి ఎరువుల స్టాక్ ను, ఎరువుల రి జిస్టర్ ,ఈ- పాస్ మిషన్ ను పరిశీ లించారు.
డిండి ప్రాంతంలో వరినాట్లు ఎప్పు డు మొదలవుతాయని ఇప్పటివర కు ఎంత మేర ఎరువులు అమ్మార ని ప్రత్యేకించి శుక్రవారం నాటి అ మ్మకాలు, తదితర వివరాలను అ డిగి తెలుసుకున్నారు. అంతేగాక షాప్ లో ఉన్న స్టాకును, ఈ-పాస్ మిషన్ ద్వారా వచ్చిన రసీదును, ఏరువుల వివరాలు పరిశీలించారు. డిండి ప్రాంతంలో వరినాట్ల సమ యంలో ఎక్కువ ఎరువుల అవసర మవుతాయని అంతేకాక వ్యవసా య సాగు ముమ్మరం కానుందని అందువల్ల ఎరువుల దుకాణదారు లు ముందుగా జిల్లా రైతులకే ఎరు వులు అమ్మాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పక్కనే ఉ న్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి సెంటర్లో ఏర్పాటు చేసిన మిషనరీ తనిఖీ చే శారు.సీట్లు, అడ్మిషన్లు తదితర వివ రాలను ప్రిన్సిపల్ రాధాకృష్ణ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్ల కు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, అవసరమైతే ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రస్తుతం ఐటిఐలో నిర్వహిస్తున్న బ్యాచ్ ల వివరాలను అని అడిగి తెలుసుకున్నారు. ఏటిసిలో ప్రవేశం పొందే విద్యార్థులకు హాస్టల్ నిర్మా ణానికి గాను బాలురు బాలికలకు వేరువేరుగా వసతి గృహాలు నిర్మిం చేందుకు 5 ఎకరాల స్థలాన్ని చూడా లని ఆమె రెవెన్యూ అధికారులను ఆదేశించారు. చుట్టుపక్కల ఉన్న భవనాలు,స్థలాల వివరాలు జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్ కట్టించడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ఆస్కారం ఉం దని ప్రిన్సిపల్ తెలిపారు. దేవర కొండ ఆర్ డివో రమణారెడ్డి, తహ సిల్దార్ శ్రీనివాస్,వ్యవసాయ శాఖ ఏ డి రెహన, ఏటీసీ ప్రిన్సిపల్ రా ధాకృష్ణ, తదితరులు ఉన్నారు.