District Collector Tejas Nandalal Power : కోదాడ ప్రభుత్వ హాస్పటల్ ను సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్
–వంద పడకల హాస్పిటల్ భవనం నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం
District Collector Tejas Nandalal Power : ప్రజా దీవేన,కోదాడ: పట్టణంలోని స్థానిక ప్రభుత్వ హాస్పటల్ ను మంగళవారం కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి ,జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సందర్శించారు ఈ సందర్భంగా హాస్పిటల్ లోని అన్ని వార్డులను కలియ తిరిగి అక్కడ పేషెంట్లకు అందుతున్న వైద్యం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వైద్యశాల పరిసరాలను, 100 పడకల వైద్యశాల నిర్మాణం చేసే స్థలాన్ని పరిశీలించారు అలాగే 100 పడకల ఆసుపత్రి భవనం నిర్మాణం పనులపై కలెక్టర్, సంబంధిత అధికారులతో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ వెంకటేశ్వరరావు, హాస్పటల్ సూపర్ డెంట్ దాశరథ, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు