District Collector Tripathi : ప్రజా దీవెన తిమలగిరి సాగర్: “దర్తీ ఆబ జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్” పథకం కింద తిరుమలగిరి సాగర్ మండలం, రంగుండ్ల తండాలో మౌలిక వసతుల కల్పనకై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం రంగుండ్ల తండాను సందర్శించారు.
ఈ పథకం కింద
పనులు చేపట్టేందు ఉన్న అవకాశాలు, తదితర అంశాలపై ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. “దర్తి ఆబ జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్” పథకం కింద గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఈ పథకంలో భాగంగా గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ,పనులు చేపట్టడం, కనీస వసతులు ఏర్పాటు చేయడం వంటివి ఆయా శాఖల ద్వారా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా రంగుండ్ల తాండలో జల్ జీవన్ కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా వాన నీటి కట్టడాలను చేపట్టాలని, గ్రామంలో అన్ని ప్రభుత్వ సంస్థల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని, 10 హెచ్ పి సోలార్ పంప్ ఏర్పాటు చేయాలని, పబ్లిక్ టాప్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని , ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ నిర్మాణం, లైబ్రరీ, స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఎం ఎస్ ఎం ఈ కింద మిరప పంటకు సంబంధించి ఒక యూనిట్ ను ఏర్పాటు చేయాలని, వ్యక్తిగతంగా చేపలు పట్టుకునేందుకు ఒక ఎకరం స్థలంలో డేమాన్స్ట్రేషన్ బ్లాక్ ఏర్పాటు చేయాలని, ఉద్యాన పంటల కింద సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ వంటివి ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ పథకం ద్వారా చేపట్టే పనులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అవసరమైన నిధులు సమకూర్చడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని గిరిజన గ్రామాలలో” దర్తి ఆబ జన్ జాతీయ గ్రామ ఉత్కర్స్ అభియాన్” పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గత సంవత్సరం నవంబర్ 15న లాంఛనంగా ప్రారంభించగా, జిల్లాలో ఈ పథకం అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ పైలెట్ పద్ధతిన ముందుగా రంగుండ్ల తాండను ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో ఉన్న సౌకర్యాలు, కల్పించాల్సిన మౌలిక వసతులపై అధికారులు, గ్రామస్తులతో సమీక్షించడం జరిగింది. జిల్లా ఇన్చార్జి గిరిజన అభివృద్ధి అధికారి మరియు గృహ నిర్మాణ శాఖ పి డి రాజకుమార్ తదితరు లు ఉన్నారు.