–వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిట ర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సవ్యంగా నిర్వహించేందు కు పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ,వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎం ఎల్ సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి కోరారు.శనివారం ఆమె ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులతో తన చాంబర్లో సమావేశమై కౌంటింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు విధానం, తదితర అంశాలపై తెలియజేశారు .
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏర్పాటు చేయనున్న టేబుళ్లు , చెల్లుబాటు అయ్యే ఓట్లు, కానీ ఓట్ల గుర్తింపు, తదితర అంశాలపై క్షుణ్ణంగా తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపును నిర్వహించడం జరుగుతుందని, ఓట్ల లెక్కింపు కార్యక్రమం సజావుగా జరిగేందుకు పూర్తి సహాయ సహకారాలు అం దించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అధనపు కలెక్టర్, వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏ ఆర్ ఓ జె. శ్రీనివాస్,అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.