Collector Ila Tripathi : ప్రజా దీవెన, నాగార్జున సాగర్: నాగార్జునసాగర్ లో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగ తుల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠ శాల మరియు కళాశాలలో సమ స్యలను తీర్చేందుకు చర్యలు తీసు కుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం ఆమె నాగార్జునసాగర్ శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి తో కలిసి నాగార్జున సాగర్ లోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల ,కళాశాల వద్ద 25 లక్షల రూపా యల వ్య యంతో నిర్మించనున్న పాదాచారు ల వంతెన పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఎం జె పి బిసి రెసిడెన్షియల్ పాఠశాల,కళాశాలను సందర్శించిన సందర్భంగా పాఠశా ల, కళాశాల లోని సమస్యలను క ళాశాల యాజమాన్యం, స్థానిక ప్ర జాప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ముఖ్యంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను కళాశాలగా అప్ గ్రేడ్ చేయడం, ఆ తదుపరి డిగ్రీ కాలేజ్ కావటం, తిరిగి బీఈడీ కళాశాల మంజూరు కావ డం వల్ల ప్రస్తుతం ఉన్న తరగతి గ దులు సరిపోవటం లేదని, అంతే కాక బీఈడీ కళాశాలకు ప్రత్యెకించి నూతన భవనాలను మంజూరు చే యాలని, డిగ్రీ కళాశాలకు ఆదనపు తరగతి గదులు కావాలని, ప్రస్తుత మున్న తరగతి గదులకు మరమ్మ తులు, టాయిలెట్స్ కావాలని జిల్లా కలెక్టర్, ఎంఎల్ ఏ దృష్టికి తీసు కు వచ్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పం దిస్తూ పాఠశాల, కళాశాలలోని స మస్యల పరిష్కారానికి ప్రభుత్వా ని కి ప్రతిపాదనలు పంపిస్తామని ఇం దుకు పూర్తి వివరాలతో నివేదిక పం పాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహా త్మ జ్యోతి బాపూలే పాఠశాల, కళా శాలలోని విద్యార్థుల సంఖ్య, ఇతర వివరాలను అడిగి తెలుసు కున్నా రు. పెద్ద వూర స్పెషల్ ఆఫీసర్, గృ హ నిర్మాణ శా ఖ పిడి రాజ కుమా ర్ ,ఈ డబ్ల్యు ఐడిసిడి ఈ శైలజ ,బి రెసిడెన్సియ ల్ పాఠశాలల ఆర్సిఓ స్వప్న, ప్రిన్సిపల్ రవి కుమార్ తది తరులు ఉన్నారు.