Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DK Sivakumar: డీకే శివకుమార్ కు గడ్డుకాలం

–ట్రబుల్ షూటర్ కు సుప్రీం కోర్టులోనూ దక్కని ఊరట
–అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌, దానికి అనుబంధంగా ఈడీ సమన్లు
–గతంలో కర్ణాటక హైకోర్టును ఆశ్ర యించిన డీకే
–తాజాగా సమన్ల రద్దుకు నిరాక రించిన ధర్మాసనం
–హైకోర్టు నిర్ణయంలో జోక్యానికి
సుప్రీంకోర్టు నిరాకరణ, పిటిషన్‌ డిస్మిస్

DK Sivakumar: ప్రజా దీవెన, బెంగళూరు: అక్రమ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఎఫ్‌ ఐఆర్‌, ఈడి (CBI FIR, Ed) సమన్ల ను సవాలు చే స్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌కు (DK Sivakumar) గడ్డుకాలం ప్రారం భమైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. దీంతో డీకే శివ కుమార్‌ (DK Sivakumar) కేసులను ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు అను బంధంగా ఈడీ జారీ చేసిన సమ న్లను ప్రశ్నిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఆ సమన్లను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరిం చింది. దీంతో డీకే శివకుమార్‌ (DK Sivakumar) సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మతో (Justice Satish Chandra Sharma) కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు విషయం లో జోక్యం చేసుకోబోమని ధర్మాస నం స్పష్టం చేసింది.

డీకే శివకు మార్‌ను (DK Sivakumar) విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబరు 25న అనుమతులు ఇచ్చింది. అందుకు అనుగుణంగానే ఆయనపై 2020 అక్టోబరు 3న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇటీవల రాష్ట్రం లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసుపై ప్రభుత్వ అను మతులను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో సీబీఐ దర్యాప్తు నుంచి విముక్తి లభిస్తుం దని భావించారు. కానీ అప్పటికే అక్రమ ఆస్తులను నిర్ధారించిన ఈడీ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉండ గా, రాజ్యసభలో మెజారిటీ లేకపో యినప్పటికీ మోదీ సర్కారు (Modi Govt) ఆధార్‌ చట్టం వంటి కీలక బిల్లులను ద్రవ్య బిల్లుల ముసుగులో ఆమోదిం పజేసుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను విచారిం చేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తా మని సుప్రీంకోర్టు పునరుద్ఘాటిం చింది. ఈ అంశం ఇప్పటికే రాజ్యాం గ ధర్మాసనం విచారణ జాబితాలో ఉందని, దీన్ని ప్రాధాన్య అంశంగా గుర్తించి, రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కపిల్‌ సిబల్‌ కోరారు. స్పందించిన సీజేఐ రా జ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేసిన వెంటనే తెలియజేస్తానని చెప్పారు.

కర్ణాటక అసెంబ్లీలో ‘ఏఐ కెమెరా’ (AI Camera)…కర్ణాటక శాసనసభలో ఎమ్మెల్యేల హాజరు, రాకపోకలను రికార్డు చేసేందుకు కృత్రిమ మేధ స్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) కెమెరాలను అమర్చారు. శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభ మయ్యాయి. ఎమ్మెల్యేలు ఏ సమ యానికి సభలో ప్రవేశిస్తున్నారు, ఎంత సేపటికి బయటకు వెళ్తు న్నారనే వివరాలను ఈ కెమెరాలు రికార్డు చేయనున్నాయి. ఎమ్మెల్యే లు ఎంతసమయం శాసనసభలో గడుపుతున్నారనేది వీటిలో రికార్డు కానుంది.