–కాల్పుల్లో నలుగురు ఆర్మీ అధికా రులు, జవాన్ లు మృతి
–మృతుల్లో ఏపీకి చెందిన డొక్కరి రాజేశ్
Doda Encounter: ప్రజా దీవెన, జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) భద్రతాబలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. సోమవారం రాత్రి తనిఖీల్లో ఉన్న జవాన్లపైకి కాల్పులు జరిపారు. ప్రతి స్పందించిన జవాన్లు, రాష్ట్ర పోలీ సులు (Jawans, State Police)ఎదురుకాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక ఆర్మీ కెప్టెన్, ఒక నాయక్, ఇద్దరు సిపా యిలు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ నాయక్ డొక్కరి రాజేశ్ ఉన్నారు. దోడా జిల్లా దేసా అటవీ ప్రాంతంలో ఉన్న ధరీగోటె ఉడార్ బాగిలో ఉగ్ర వాదులు నక్కి ఉన్నట్లు ఉప్పందు కున్న సైన్యం, జమ్మూక శ్మీర్ రాష్ట్రీ య రైఫిల్స్ బలగాలతో కలిసి సోమ వారం సాయంత్రం 7 గంటల సమ యంలో కట్టడిముట్టడి తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో చీక ట్లో నక్కిన ఉగ్రవాదులు బలగాల పైకి కాల్పులు జరిపారు.
భద్రతా బలగాలు (Security forces) ఎదురుకాల్పులకు దిగా యి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపో యారు. వారిని వెంబడిస్తూ వెళ్లిన బలగాలు రాత్రి 9 గంటల సమ యంలో ఉగ్రవాదులను గుర్తించా యి. మరోమారు ఇరువైపులా కా ల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ బ్రిజేశ్ థాపా (Army Captain Brijesh Thapa), తెలుగువాడైన ఆర్మీ నాయక్ డొక్కరి రాజేశ్, రాజస్థాన్‌కు చెందిన సిపాయిలు బిజేంద్ర, అజయ్ అమ రులయ్యారు. ఆ వెంటనే ఆర్మీ కమాండోలు, రాష్ట్ర సాయుధ బలగాలు అటవీ ప్రాంతంలో ము మ్మరంగా తనిఖీలు చేపట్టాయి.
అటు లద్దా ఖ్‌లో (Ladda Kh) కూడా సైన్యం అప్రమత్తమై తనిఖీలను ముమ్మరం చేసింది. కాగా గడిచిన 32 నెలల్లో ఉగ్రవా దులు జరిపిన దాడుల్లో 48 మంది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. జమ్మూకశ్మీర్‌లో సుమారు 60 మంది ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైనికుల మృతిపట్ల కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభు త్వం తన విధానాలతో జవాన్ల జీవి తాలతో ఆటలాడుకుంటోందని రాహుల్‌గాం ధీ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ డీజీపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నా రని, ఆయనను మారిస్తే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని ముఫ్తీ అభిప్రాయప డ్డారు. మరోవైపు ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ స్థానిక ప్రజలు దోడాలో పాకిస్థాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.