Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy Venkat Reddy : సమాజంలో కుక్కకాటు ఘటనలు పెరిగిపోతున్నాయి

–ప్రజలలో అప్రమత్తతతో పాటు కుక్కలకు వాక్సినేషన్, స్టెరిలైజేషన్ అవసరం

— వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి

— రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Minister Komatireddy Venkat Reddy :

ప్రజా దీవెన, నల్లగొండ:దేశంలో ఇ టీవల కుక్క కాట్లు పెరిగిపోతున్నా యని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలలో అప్రమత్తతతో పాటు కు క్కలకు వాక్సినేషన్, స్టెరిలైజేషన్ వంటి కార్యక్రమాలు అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి అన్నారు. శనివారం అయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని రాంనగర్ పార్కులో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారం భించారు.

హైదరాబాద్ తర్వాత రెండవ అతి పెద్ద కుక్కల దత్తత కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో నిర్వహించడం ప ట్ల ఆయన అభినందించారు. ఒక వైపు కుక్కల సంతతి పెరగకుండా స్టెరిలైజేషన్ ఇస్తూనే, కుక్కలను కా పాడే ప్రయత్నం చేయాలని, ఎవ రూ కుక్కలకు హాని చేయవద్దని, ఎ ట్టి పరిస్థితిలో చంపకూడదని అ న్నారు. కుక్క కాట్ల పై ఇటీవలి సు ప్రీం కోర్టు స్పందనను ఆయా ప్రస్తా వించారు.

నల్గొండ జిల్లాలో సుమా రు 40 వే ల కుక్కలు ఉన్నట్లు అధికారిక లె క్కల ప్రకారం తెలుస్తున్నదని, అ యితే అమెరికా లాంటి దేశాల్లో కు క్కలను సైతం మనుషుల్లాగా చూ స్తున్నారని, కుక్కలకు కూడా ఎంతో విలువ ఇస్తారని, ప్రత్యేకించి కుక్క లకు ఫైవ్ స్టార్ హోటళ్లు ఉన్నా యని తెలిపారు.కుక్కలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారిని ఆయన అభినందించారు.

ఇలాంటి కార్యక్రమాలకు భవిష్య త్తులో పూర్తి సహకారం ఇస్తామని, ప్రజలు కుక్కల బారిన పడకుండా ఉండేందుకుగాను కుక్కలకు వ్యా క్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని, జిల్లాలోని అన్ని మున్సి పాలిటీలు, పట్టణ ప్రాంతాలతో పా టు, గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన జిల్లా యంత్రాంగానికి సూచించారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లా డుతూ ఇటీవల కాలంలో వీధి కు క్కలు కోతులు, పిల్లుల సంఖ్య పెరి గిపోయి వాటి దాడులు ఎక్కువ అ వుతున్నాయని, వాటిని నివారిం చేందుకు కుక్కల దత్తత వ్యాక్సినే షన్స్, స్టరీలైజేషన్ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు మిగి లిపోయిన ఆహారాన్ని వీధుల్లో వే యడం, కుక్కలకు ఆహార పదార్థా లను అందించడం, తదితర కార ణాలవల్ల కుక్కలు మనుషులపై దా డి చేస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని బయట పడవేయొద్దని కోరారు. కుక్కలను చంపడం నేర మని, అలా కాకుండా కుక్కల సం ఖ్య పెరగకుండా స్టరీలైజేషన్ చే య డం వాక్సినేషన్ చేయడం వంటివి చేపట్టడం జరుగుతున్నదని, కుక్క కొరికిన వారు తప్పనిసరిగా రాబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సినేషన్ వే యించుకోవాలని, పెంపుడు కుక్క లకు ఇండ్లలో వ్యాక్సినేషన్ ఇప్పిం చాలని ఆమె తెలిపారు.

నల్గొండ జిల్లాలో 92000 గృహాలు ఉండగా, సుమారు 5000 కుక్కలు ఉన్నాయని ఒక్కొక్కరు ఒక్కో కుక్క ను దత్తత తీసుకుంటే కుక్కల బెడ ద ఉండదని తెలిపారు. శనివారం నిర్వహించిన కుక్కల దత్తత కార్య క్రమంలో 49 కుక్కలను దత్తత ఇ చ్చినట్లు ఆమె తెలిపారు. మిర్యా లగూడ సబ్ కలెక్టర్ నారాయణ అ మీత్ మాట్లాడారు. జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్, మిర్యాలగూడ ఎ మ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, డి ఎ ఫ్ ఓ రాజశేఖర్, దేవరకొండ ఏసీపీ మౌనిక, అడిషనల్ రమేష్, ఆర్ డి ఓ అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ రమేష్, మున్సిపల్ కమి ష నర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఇ తర జిల్లా అధికారులు, ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.