Don’t go to groups… Support for improvement గ్రూపు ల గోల వద్దు… అభివృద్దే ముద్దు
--సూర్యాపేట లో కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ -- బీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నాయకుడు గోపగాని వెనుధర్ గౌడ్ -- గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికిన మంత్రి -- వేణుధర్ బాట లోనే మరికొంత మంది కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు, సీనియర్ , యూత్ కాంగ్రెస్ నేతలు
గ్రూపు ల గోల వద్దు… అభివృద్దే ముద్దు
–సూర్యాపేట లో కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్
— బీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నాయకుడు గోపగాని వెనుధర్ గౌడ్
— గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికిన మంత్రి
— వేణుధర్ బాట లోనే మరికొంత మంది కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు, సీనియర్ , యూత్ కాంగ్రెస్ నేతలు
ప్రజా దీవెన/సూర్యాపేట: సూర్యాపేట లో కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. గ్రూపు ల గోల వద్దు.. అభివృద్ధి నే ముద్దు అంటూ మంత్రి జగదీష్ రెడ్డి (minister jagadeesh Reddy)చేస్తున్న అభివృద్ధి యజ్ఞం లో భాగస్వామ్యం అయ్యేందుకు సీనియర్ కాంగ్రెస్ (congress )నాయకుడు గోపగాని వేణుధర్ గౌడ్ ఆ పార్టీ కి రాజీనామా చేసి ముఖ్య అనుచరులు, వంద మంది కార్యకర్తల తో కలిసి సూర్యాపేట(suryapeta)లోని క్యాంపు కార్యాలయం లో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలోబీఆర్ఎస్ లో చేరారు.
*కాంగ్రెస్ కార్యకర్తలు ఆత్మ విమర్శ చేసుకోవాలి: గోపగాని వేణుదర్ గౌడ్* ….తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం
గ్రూపు గొడవలు కొట్లాటలు ప్రోత్సాహించేది కాంగ్రెస్ నాయకుల ది అయితే, పార్టీల కు అతీతమైన అభివృద్ధి చేయడమే మంత్రి జగదీష్ రెడ్డి ఎజెండా అని బీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నాయకుడు వేణుదర్ గౌడ్ అన్నారు. సూర్యాపేట లో జరిగిన అభివృద్ధిని పార్టీల కతీతంగా ప్రజలు ఒప్పుకుని తీరాల్సిందే అని అన్నారు. ఇంత కాలం కాంగ్రెస్ లో ఉండి తప్పు(rong decision) చేశానన్న వేణుదర్ గౌడ్, తన లాగే కాంగ్రెస్ పార్టీ లో ఉన్న నాయకులు కూడా మనోవేదనకు గురవుతున్నారని అన్నారు.. ఇప్పటి కైనా కాంగ్రెస్, బిజెపి పార్టీ నేత ల మాయ మాటలు నమ్మి మోసపోకుండా, మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట లో కొనసాగిస్తున్న అభివృద్ధి యజ్ఞంలో భాగస్వామ్యం(. అవ్వాలని కోరారు. బీఆర్ఎస్ లో చేరిన నేతలకు గులాబీ కండువా కప్పిన మంత్రి జగదీష్ రెడ్డి సాదరంగా ఆహ్వానం( an invitation) పలికారు. చేరిన వారిలో ప్రధానంగా రెగ్గలం నాగభూషణం చారి , చింత రవి, జటోతు రమేశ్ , దశరథ, మొగిలి చిన్న వెంకన్న ,మొగిలి ఎల్లయ్య,శరత్ లతో పాటు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఒంటెద్దు నర్సింహ రెడ్డి, జడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, కటికం శ్రీనివాస్ గౌడ్, మోదుగు నాగిరెడ్డి ఉన్నారు.