Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Draupadi Murmu: తీర్పు వచ్చే సరికి ఓ తరం

–న్యాయస్థానం అంటేనే సామా న్యుల్లో వణుకు
–అధ్యయనం చేయండo ద్వారా అంతకంతకు మార్పు
–న్యాయ వ్యవస్థకు రాష్ట్రపతి ముర్ము సూచన

Draupadi Murmu: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కక్షిదా రులకు సత్వర న్యాయం అందా లంటే కోర్టుల్లోని వాయిదాల సం స్కృతిని మార్చాల్సి ఉందని ఆది వారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) అభిప్రాయపడ్డారు. దీనిపై తొలుత దృష్టి పెట్టాలని న్యాయవ్యవస్థకు సూచించారు. ఇక్కడ రెండు రోజు ల పాటు జరిగిన జిల్లా స్థాయి న్యా యవ్యవస్థ జాతీయ సదస్సు ము గింపు ఉత్సవంలో ఆమె ప్రసంగిం చారు. పెండింగ్‌ కేసులు ‘మనంద రికీ’ పెద్ద సవాలుగా మారాయని అన్నారు. ఈ సమస్యను పరిష్క రించాలంటే తొలుత కేసుల విచార ణను వాయిదా వేసే విధానంలో మార్పులు రావాలని చెప్పారు.

అత్యాచారం (rape)వంటి కేసుల్లోనూ తీర్పులు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యా చారం వంటి కేసుల్లోనూ తీర్పులు వచ్చేసరికి తరం మారుతోంది. న్యాయ ప్రక్రియలో సున్నితత్వం లోపించిందని సామాన్యులు అను కుంటున్నారని రాష్ట్రపతి వ్యాఖ్యా నించారు. గ్రామాల్లోని ప్రజలు న్యాయాలయాలను (Courts) దేవాలయాలుగా భావిస్తున్నారని అన్నారు. ‘‘దేవుని ఇంట్లో ఆలస్యం జరుగుతుందేమో గానీ, అన్యాయం మాత్రం జరగదని నమ్ముతుంటారు. కానీ ఈ అలస్యం ఎంత కాలం మనమంతా దీనిపై ఆలోచించాలి’’ అని హితవు చెప్పా రు. కొందరికి న్యాయం లభించే సమయానికి వారి ముఖాల్లో నవ్వు లు కనిపించడం లేదు.

కొందరి జీవి తాలు అంతమవుతున్నాయి. దీని పై మనమంతా దృష్టి పెట్టాలని అ న్నారు. కోర్టు రూముల తీరుపైనా రాష్ట్రపతి అన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోర్టు రూముల సెట్టింగ్‌ ను చూడగానే సామాన్యుల్లో ఒత్తిడి పెరుగుతుందని (The pressure will increase)అన్నారు. దీనికి ‘నల్ల కోర్టు లక్షణం’ (బ్లాక్‌ కోర్ట్‌ సిం డ్రోం) అన్న పేరు పెట్టారు. దీనిపై అధ్యయనం జరగాలని సూచించా రు. న్యాయాధికారుల పోస్టుల్లో మహిళల సంఖ్య పెరుగుతుండడం పై హర్షం వ్యక్తం చేశారు.సీజేఐ జస్టి స్‌ చంద్రచూడ్‌ (Chandrachud)ప్రసంగిస్తూ జిల్లా స్థా యి కోర్టుల్లో మహిళా అధికారులు, న్యాయవాదులకు తగిన సౌకర్యా లు లేవని చెప్పారు. కేవలం 6.7శా తం కోర్టుల్లోనే మహిళలకు కనీస సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 60–70 శాతం మేర మహిళలను న్యాయాధికారు లుగా భర్తీ చేస్తున్నారని, అలాంట ప్పుడు వారికి కావాల్సిన సౌకర్యా లు కల్పించాల్సి ఉందని చెప్పారు.