Drug addicts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు (Drug addicts) ఒక బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మద్యం దుకాణాలు మూత పడబోతున్నాయి. ఇలా మూత పడడానికి గల కారణం ఏమిటంటే సెప్టెంబర్ 30 నాటికి వైన్ షాపుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల (Contract employees) కాంట్రాక్టు కాలం పూర్తి అవ్వడమే. అయినా కానీ మరో 10 రోజులపాటు వైన్ షాపులు తెరవాలని ఏవి ప్రభుత్వం వారిని కోరారు. అయితే పది రోజుల తర్వాత ఎటు తమ ఉద్యోగాలు ఉండవన్న ఉద్దేశంతో.. నేటి నుంచి కాంట్రాక్టు ఉద్యోగులు విధుల్లోకి రాలేదు. ఎలాగో ప్రవేట్ వైన్స్ షాప్ వస్తాయన్న నేపథ్యంలో నేటి నుంచి వైన్ షాప్ కాంట్రాక్టు ఉద్యోగులు విధుల్లోకి రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 3240 వైన్ షాపులు తెరుచుకోలేదు. దీంతో చాలా మంది మద్యం ప్రియులు మందు కావాలంటే బార్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వాస్తవానికి వైన్ షాపులలోని మద్యానికి, బార్లలో (BARS) ఉండే మద్యం ధరలలో చాలా తేడా మనం చూడవచ్చు. కనుక కొత్త మద్యం దుకాణాలు వచ్చేంత వరకు మందుబాబులకి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్న మాటలో సందేహం లేదు. అక్టోబర్ 12 నుండి కొత్త మధ్య పాలసీ ప్రకారం మద్యం మరింత ప్రియం కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ ను జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా గత ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి చెబుతూ కొత్త పాలసీని తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు (Liquor stores)మూతపడి అక్టోబర్ 12వ తేదీ నుండి ప్రవేటు మద్యం షాపులు అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారాం. అయితే కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ రావడంతో అక్టోబర్ 1 (మంగళవారం) నుండి అక్టోబర్ 9 వరకు దరఖాస్తులు తీసుకొని ఉన్నారు. ఆ తర్వాత 11వ తేదీన 3396 దుకాణాలకు లాటరీ తీయనున్నారు అధికారులు. ఈ దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తుకు రెండు లక్షల రూపాయల రుసుమును నిర్ణయించారు ఎక్సైజ్ శాఖ. అలాగే లైసెన్స్ ఫీజుల కింద 5 నుండి 85 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి. ఈ క్రమంలో రెండేళ్ల కాలపరిమితితో (Two-year time limit) నూతన మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వబోతున్నట్టు సమాచారం . దీంతో నేడు ఉదయం పలు జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు షాపులను గుర్తించి గెజిట్ లను జారీ చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం జరిగింది. ఆఫ్లైన్, ఆన్లైన్ (Offline, online)విధానం ద్వారా దరఖాస్తులను అప్లై చేసుకునే విధంగా వెసులుబాటును కల్పించారు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అధికారులు కలిపించినట్టు సమాచారం.